జాతీయ వార్తలు

కాంగ్రెస్ గూటికి కిరణ్‌కుమార్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఉదయం పనె్నండు గంటలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి ఉమన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు ఇతర సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంటున్నారు. అవిభాజిత ఏపీ ఆఖరు ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి తెర వెనక నుండి మద్దతు ఇవ్వటంతోపాటు కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు విరుద్ధంగా పని చేయటం తెలిసిందే. రాష్ట్రాన్ని విభజించాలన్న అధినాయకత్వ నిర్ణయాన్ని బాహటంగా ఎదురించిన కిరణ్‌కుమార్ రెడ్డి విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసి చెప్పుగుర్తుతో విభాజిత ఆంధ్రప్రదేశ్ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించటం తెలిసిందే. విభాజిత ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసినప్పటి నుండి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక దశలో ఆయన బీజేపీలో చేరేందుకు కూడా ప్రయత్నించారు. 2019లో జరగనున్న లోక్‌సభతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి మరోసారి క్రియాశీల రాజకీయాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.