జాతీయ వార్తలు

బొంబాయి, మద్రాసు హైకోర్టుల పేర్లు మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: బొంబాయి, మద్రాసు హైకోర్టుల పేర్లు మారనున్నాయి. మారిన నగరాల పేర్లకు అనుగుణంగా ఈ హైకోర్టుల పేర్లను మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్లకు అనుగుణంగా బాంబే హైకోర్టును ముంబయి హైకోర్టుగా, మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చాలని మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. మద్రాసు నగరం పేరును చెన్నైగా, బొంబాయి నగరం పేరును ముంబయిగా మారుస్తూ గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నగరాల పేర్లు మారినప్పటికీ బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 1860లో ఏర్పాటయినప్పుడు ఉన్న పేర్లతోనే కొనసాగుతున్నాయి. ఈ పేర్లను మార్చాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. అయితే వీటి పేర్లను మార్చడానికి కేంద్ర చట్టం ఏదీ లేదు. దీంతో సమగ్ర అధ్యయనం హైకోర్టుల (పేర్ల మార్పు) చట్టం 2016ను రూపొందించారు. కలకత్తా హైకోర్టును కూడా కోల్‌కతా హైకోర్టుగా మారుస్తారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.