జాతీయ వార్తలు

జేడీ(యూ), బీజేపీ చెట్టపట్టాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 12: బీజేపీతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, జేడీ(యూ), బీజేపీ మధ్య పొత్తు ఎంతోకాలం సాగదనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ వదంతులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెక్ పెట్టారు. బీహార్‌లో బీజేపీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా గురువారం ఇక్కడకు అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షాను జేడీ(యూ) అధినేత, సీఎం నితీశ్ కుమార్ కలుసుకున్నారు. ఈ ఇద్దరు నేతలతోపాటు కేంద్ర మంత్రులు ఎంతో ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. విలేఖర్లతో సీఎం నితీశ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడకపోయినా, వారిరువురి మధ్య చర్చలు ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగినట్లు బీజేపీ, జేడీ (యూ) వర్గాలు తెలిపాయి. అమిత్ షా ఇక్కడ రాష్ట్ర గెస్ట్ హౌస్‌లో బస చేస్తున్నారు. గురువారం ఉదయం నితీశ్ కుమార్‌ను అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల సేపు ఇరువురు నేతలు చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తుపై ఇరు పార్టీల మధ్య గత కొంతకాలంగా వివాదంనడుస్తోంది. తమకు ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. అన్ని సీట్లు ఇచ్చేదిలేదని, బీజేపీకి పాపులారిటీ తగ్గిందని జేడీ(యూ) నేతలంటున్నారు. గురువారం రాత్రి అమిత్ షాను డిన్నర్‌కు సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానించారు.
నితీశ్ కుమార్, బీజేపీ మధ్య 2010లో సంబంధాలు తెగిపోయాయి. అంతవరకు 17 ఏళ్ల బంధాన్ని పక్కనపెట్టి జేడీ(యూ) 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి దెబ్బతింది. ఈ ఎన్నికల్లో రెండే రెండు సీట్లు వచ్చాయి. కాగా ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింది. ఆర్జేడీతో పొత్తుపెట్టుకుని లాభపడిన జేడీ(యూ)కు 71 సీట్లు వచ్చాయి. కాగా ఆర్జెడీతో పొత్తు తెగతెంపులు చేసుకున్న నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ గూటికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అమిత్ షా దృష్టినిసారించారు. ఇందులో భాగంగా ఆయన స్థానికంగా భావసారూప్యత ఉన్న పార్టీలను, ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములను కలుస్తున్నారు. కాగా ఈ భేటీకీ ఎల్జీపీ అధినేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్, ఆర్‌ఎల్‌ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వాహ హాజరు కాలేదు. వీరిరువురు నేతలు విదేశాల్లో ఉన్నారు.

చిత్రం..పాట్నాలో గురువారం సమావేశం అనంతరం చిరునవ్వులు చిందిస్తూ వెలుపలకు వస్తున్న బిహార్ సీఎం నితీశ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా