జాతీయ వార్తలు

రిపబ్లిక్‌డే వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రంప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: వచ్చే ఏడాది జనవరిలో జరిగి గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ మేరకు అమెరికా వైట్‌హౌస్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆహ్వానం పంపినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే దీనిని అమెరికా ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు. ఒకవేళ దీనికి ట్రంప్ అంగీకరిస్తే విదేశీ విధానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా దీనిని మోదీ ప్రభుత్వం ప్రకటించుకునే అవకాశాలున్నాయి. ఇటీవల ఆ దేశంతో జరిగిన వరుస దౌత్యసంబంధ సమావేశాల అనంతరం గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా రావాలని మోదీ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే శే్వతసౌధానికి లాంఛనప్రాయంగా ఆహ్వానం పంపింది. ఒకవేళ ఆయన ఈ ఆహ్వానాన్ని మన్నించి భారత్‌కు వస్తే ఇద్దరు అమెరికా అధ్యక్షులను భారత్ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేలా చేసిన ఘనత నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏకు దక్కుతుంది. 2015లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సతీమణి మిచ్చెలితో పాల్గొని మొదటి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఇప్పుడు భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో భారత్‌కు ట్రంప్ వస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణిజ్య సంబంధాలపై ఇటీవల ఆ దేశంతో ఏర్పడిన విభేదాలు, ఇరాన్ దేశంతో ఎనర్జీ, చమురు విభాగాలతో భారత్‌కు ఏర్పడుతున్న సంబంధాలు, రష్యా నుంచి ఎస్-400 మిస్సయిల్ కొనుగోలు చేయాలన్న భారత్ ప్రతిపాదన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ అమెరికాకు కంటిలోని నలుసులాంటివేనని, ఈ నేపథ్యంలో ట్రంప్ భారత్‌ను సందర్శిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ.