జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లోకి కిరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జులై 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.శుక్రవారం ఉదయం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ,ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రులు పల్లంరాజు, జే.డీ శీలంలతో కలిసి రాహుల్‌గాంధీతో కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ చేరే ముందు పలుమార్లు కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిపింది తెలిసిందే. అలాగే కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో గత ఆరు నెలలుగా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జై సమైఖ్యాంధ్ర పార్టీ అధినేత, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ
తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతోనే గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. తన తండ్రి నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ ఎమ్మెల్యేగా, మంత్రిగా, తాను నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, చీఫ్‌విఫ్‌గా, స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యామంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనేనాని స్పష్టం చేశారు. గాంధీ కుంటుంబంతో సన్నిహితంగా మెలగడం వల్లనే ఈ పదవులు అనుభవించగలిగినట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో తన బంధం విడదీయలేనిదని,మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరానాని,పార్టీ ఎ బాధ్యత అప్పగించినా సమర్ధ వంతంగా నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూతనతో పాటుగా కాంగ్రెస్ వీడిన 30-40 మంది నాయకులను పార్టీలోకి తిరిగి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లోఅధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరతాయని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితినే తెలుగు రాష్ట్రాంల్లో అభివృద్ధి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో నాటి ప్రధాని మంత్రి మాన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలను ఎన్డీయే ప్రభుత్వం అపహాస్య చేసిందని,విభజన చట్టం అమల్లో ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని చెప్పారు. విభజన హామీలు అమలు చేయడంతో అధికార విపక్షాలు పూర్తిగా విఫలం చేందాయని ఆరోపించారు. విభజన చట్టాన్ని రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి రాగానే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. ముందుగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తన స్నేహితుడు కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో సదరంగా ఆహ్వానింస్తున్నట్టు చెప్పారు. ఏపీలో భావోద్వేగలతో కాంగ్రెస్ పార్టీని చాలామంది విడరని చెప్పారు. ఒకటి ఉమ్మడి ఎ.పీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి మరణించడం,ఆ భావోద్వేగంతో కాంగ్రెస్ పార్టీని విడి జగన్ పార్టీలో చేరరాని,అలాగే రాష్ట్ర విభజనతో మళ్లీ కాంగ్రెస్ పార్టీని విడి వెళ్లారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉమ్మడి రాష్ట్ర విభజన జరగకుడదని కొరుకున్నారని,అందులో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడ ఒకరని చెప్పారు.ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమన్‌చాంధీ పార్టీని విడి వెళ్లిన వారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారని రఘువీరారెడ్డి గుర్తు చేశారు.

చిత్రం..రాహుల్ గాంధీతో కరచాలనం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి