జాతీయ వార్తలు

2019 ఎన్నికలే టార్గెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/వారణాసి, జూలై 13: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజులు పాటు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గం వారణాసి, అజాంగఢ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. వారం రోజుల్లోనే రెండోసారి యూపీ పర్యటనకు రావడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశే్లషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, దేశంలోనే అత్యధిక పార్లమెంటు స్థానాలున్న నియోజవర్గంలో పట్టుసడలకుండా చూస్తే కేంద్రంలో సునాయాసంగా మళ్లీ అధికారంలోకి రావచ్చన్నది ఓ ఆలోచన. ఇందులో భాగంగానే బిజీ షెడ్యూల్ అయినప్పటికీ వారంలోనే రెండోసారి రాష్ట్రానికి వస్తున్నట్టు చెబుతున్నారు. వారణాసి, ఆజామ్‌గఢ్, మీర్జాపూర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఢిల్లీ శివార్లలోని నొయిడాలో సామ్‌సంగ్ మొబైల్ ఫ్యాక్టరీని సోమవారం ప్రధాని ప్రారంభించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేయిన్ పాల్గొన్నారు. కాగా శనివారం వారణాసిలో వంద కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో సరాసరి అజామ్‌గఢ్ వెళ్లి ఎక్స్‌ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేస్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ ప్రాజెక్టు. తమకు రావల్సిన క్రెడిట్‌ను కొట్టేయడానికే మోదీ హడావుడిగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని సమాజ్‌వాదీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా గురువారం ఆజామ్‌గఢ్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపారు. ఎక్స్‌ప్రెస్ హైవే రాష్టర్రాజధాని, తూర్పు యూపీలోని ఘాజీపూర్‌ను కలుపుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నారని ఎస్‌పీ ధ్వజమెత్తింది. ఎక్స్‌ప్రెస్ హైవేను 23వేల కోట్ల రూపాయలతో చేపట్టారు. మూడేళ్లలో దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అక్కడ నుంచి వారణాసి వెళ్తారు. కఛ్‌నర్ గ్రామంలో ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడతారు. మధ్యాహ్నం లక్నోలోని డీఎల్‌డబ్ల్యూ అతిథిగృహంలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని భేటీ అవుతారు. ఆదివారం మీర్జాపూర్‌లో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. మీర్జాపూర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తారు. మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అప్నాదళ్ (సోనేలాల్) ప్రాతినిధ్యం వహిస్తోంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి అప్నాదళ్ మిత్రపక్షంగా కొనసాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఇటీవలే మీర్జాపూర్‌లో పర్యటించారు. ప్రధాని మోదీ పర్యటన రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అప్నాదళ్ స్పష్టం చేసింది. కఛ్‌నర్ సభలో మాట్లాడిన తరువాత వెయ్య కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టుకు మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. పెర్షిబుల్ కార్గో సెంటర్, రోడ్ రిపేర్ పథకాలు, టౌన్‌హాల్ ఆధునీకరణ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కేన్సర్ ఆసుపత్రి, హెరిటేజ్ వాక్, బీపీవో సెంటర్, బాలియాకు కొత్త రైలు సర్వీస్ తదితర అభివృద్ధి కార్యక్రమాలున్నాయని రాష్ట్ర మంత్రి నీల్‌కాంత్ తివారీ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులు, కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, మనోజ్ సిన్హా, ధర్మేంద్ర ప్రధాన్ హాజరవుతారు.