జాతీయ వార్తలు

హరేన్ పాండ్యా హత్యకేసు నిందితుడ్ని పాక్‌కు అప్పగించిన అరబ్ ఎమిరేట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: ఎంతోకాలంగా భారత నిఘా సంస్థలు వెతుకుతున్న పేరుమోసిన టెర్రరిస్టు, బీజేపీ నేత హరేన్ పాండ్యా హత్యకేసులో నిందితుడైన ఫారుక్‌దెడీవాలాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోలీసులు పాకిస్తాన్‌కు అప్పగించి భారత్‌కు షాక్ ఇచ్చారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడైన ఫారుక్‌ను ముంబయికి చెందిన శ్యాంతో కలిసి దుబాయి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అనంతరం వారిద్దరినీ వారం క్రితం పాకిస్తాన్‌కు అప్పగించారు. పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థ సహకారంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న దెడీవాలాపై మన దేశ నిఘా సంస్థలు కన్ను వేసి అతని కదలికలను ఆరా తీశారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులను నియమించుకుని, వారికి శిక్షణ ఇచ్చేవాడు. అంతేకాకుండా గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యకేసు కుట్రతో పాటు అనేక కేసుల్లో నిందితుడు. అతను యుఏఇలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడి అధికారుల సహాయాన్ని కోరారు. అయితే భారత్‌కు షాక్ ఇస్తూ వారిద్దరినీ పాకిస్తాన్ దేశానికి అప్పగించారు. వారు దెవిడీవాలా తమ దేశపౌరుడైనందున అతడిని తమకే అప్పగించాలని పాక్ అధికారులు కోరడంతో వారిని అప్పగించినట్టు యుఏఇ వర్గాలు వెల్లడించాయి. అయితే ఐఎస్‌ఐ తయారు చేసిన నకిలీ పత్రాలతో అతను తమ పౌరుడని పాక్ పేర్కొన్నట్టు మనదేశ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా అతడిని రక్షించడానికి పాక్ ఈ చర్యకు పాల్పడిందని అనుమానిస్తోంది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన విదేశాలకు పారిపోయే ఉగ్రవాదులను రక్షించడానికి ఐఎస్‌ఐ ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందని, విదేశాల్లో వారిని అరెస్టు చేయకుండా రక్షణ కల్పించడానికి వారు తమ దేశపౌరులని పేర్కొంటూ తమ దేశానికి రప్పించుకుంటోందని అధికారులు ఆరోపిస్తున్నారు. దెడీవాలా దావూద్ గ్యాంగ్‌లో చేరకముందు అర్జున్ గ్యాంగ్‌తో ఉండేవాడు. ఇతనికి దావూద్ గ్యాంగ్ సభ్యుడు సలీమ్‌కుట్టాతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడతారనే అనుమానంతో ఇటీవల ముంబయి, గాంధీనగర్‌లో ఇద్దరు అనుమానితులను మహారాష్ట్ర ఏటిఎస్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారు తమ టార్గెట్‌లో ఒక కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను చెప్పారు. అలాగే దెడీవాలాకు ఐఎస్‌ఐతో ఉన్న సంబంధాలు, అతని నెట్‌వర్క్ గురించి వెల్లడించారు. ఇలావుండగా భారత్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులకు పాక్ కాపు కాయడం ఇది మొదటిసారి కాదు. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ హత్య కేసులో నిందితుడైన మున్నా జింగడాను రక్షించడానికి ఇదే పద్ధతిని అనుసరించింది. జింగడా తమ దేశ పౌరుడని పేర్కొంటూ నకిలీ డాక్యుమెంట్లను థాయ్ కోర్టుకు సమర్పించింది.