జాతీయ వార్తలు

స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్‌ను ప్రారంభించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: దేశంలోని అన్ని జిల్లాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం పరిస్థితులను అంచనా వేసి ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిష్టాకరమైన స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ అనే ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కింద అన్ని జిల్లాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలవుతున్న తీరును మదింపు వేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే సలహాలు, సూచనలు ఇస్తారు. కేంద్ర మంచినీటి, పారిశుద్ధ్య శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది.గ్రామీణ ప్రాంతాల్లో వివరాలను స్వచ్ఛ్ భారత్ మిషన్ నుంచి సేకరిస్తారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు, గ్రామ కార్యాలయాల వద్ద సర్వేలు నిర్వహిస్తారు. పౌరుల అభిప్రాయాలను సేకరిస్తారు. పరిశుభ్రతలో అత్యుత్తమ పద్ధతులు పాటించి ముందు నిలిచిన జిల్లాలు, గ్రామాలకు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన అవార్డులు ఇస్తారు. 680 జిల్లాల్లో 6800 గ్రామాల్లో 34వేల బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను మదింపు వేస్తారు. 54వేల మంది ప్రజల నుంచి అభిప్రాయలాను సేకరిస్తారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌ను పటిష్టతకు కార్యక్రమాన్ని చేపట్టారు. వివరాలు సేకరించేందుకు ప్రైవేట్ సంస్థలను కూడా రంగంలోకి దించారు. సర్వే నిర్వహణకు మార్గదర్శకాలు, సూచికలను జారీ చేశారు. ఆన్‌లైన్, మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను పంపవచ్చునని కేంద్రం పేర్కొంది.