జాతీయ వార్తలు

ఏ బాధ్యతనైనా స్వీకరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అప్పగించే ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోడలిననీ, అక్కడే జన్మించానని, కీలక బాధ్యతలు చేపట్టడానికి ఈ అర్హతలు సరిపోతాయని తాను భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఉపకరిస్తాయా అని విలేఖరులు అడిగినప్పుడు ఆమె పైవిధంగా బదులిచ్చారు. పార్టీ నిర్ణయం వెలువడిన తర్వాత తాను వ్యాఖ్యానించడానికి వీలుకలుగుతుందని, అయినప్పటికీ యుపికి సంబంధించి పార్టీ ఎలాంటి బాధ్యతను అప్పగించినా సైనికురాలిగా పనిచేస్తానని షీలా స్పష్టం చేశారు. యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తలను విలేఖరులు ప్రస్తావించగా, ప్రియాంక రాకను స్వాగతిస్తామని, అలాగే పార్టీ విజయానికి ఆమె ఎంతో దోహదకారి అవుతుందని షీలా వ్యాఖ్యానించారు. ‘ఏం జరుగుతుందనేది నేను ఇప్పుడే చెప్పలేను. అలా చెప్పడం కూడా తొందరపాటే అవుతుంది’ అని పేర్కొన్నారు.