జాతీయ వార్తలు

యూపీ బిజెపి సిఎం అభ్యర్థిగా అనుప్రియ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన రాజకీయ నేపథ్యం, ఓబిసి మూలాలు కలిగిన అనుప్రియ పట్టేల్ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందా? ప్రధాని మోదీకి విధేయురాలిగా భావిస్తున్న అనుప్రియ అప్నాదళ్ టికెట్‌పై మీర్జాపూర్ నుంచి ఘన విజయం సాధించారు. యూపిలో అప్నాదళ్‌కు బలమైన ఓబిసి ఓటు బ్యాంకు ఉంది, దీని దృష్ట్యానే ఆమెను సిఎం అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. తాజాగా ఆమెను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంలోని ఉద్దేశం కూడా ఇదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 35 ఏళ్ల అనుప్రియను కేబినెట్‌లోకి తీసుకునే విషయంలో మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. యూపీలో బిజెపి మిత్రపక్షమైన అప్నాదళ్ తరఫున మీర్జాపూర్ లోక్‌సభకు పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆమె తండ్రి, కుర్మీ సామాజిక వర్గనేత సోనేలాల్ పటేల్ అప్నాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 2009లో ఆయన మృతి చెందడంతో తల్లి కృష్ణపటేల్ పార్టీ పగ్గాలు చేపట్టారు. తరువాత పార్టీలోనూ విభేదాలు తలెత్తాయి. అనుప్రియ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సొంత తల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనుప్రియకు మోదీ కేబినెట్‌లో చోటు దక్కడం అంతటా చర్చానీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటున్నారు.

చిత్రం.. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్న అనుప్రియ