జాతీయ వార్తలు

విమర్శలు కాదు.. భారత్ వచ్చి చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: అభివృద్ధిలో భారత్‌దేశం వెనక్కి వెళుతోందన్న విమర్శలు చేసేముందు నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ భారత్‌ను ఒకసారి సందర్శించి ఇక్కడ మోదీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ కోరారు. ‘అమర్త్యసేన్ దయుంచి ఒకసారి ఇండియా వచ్చి ఇక్కడ కొంతకాలం ఉండి ఇక్కడి వాస్తవ పరిస్థితులు పరిశీలించండి, గత నాలుగు సంవత్సరాలుగా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి, అప్పుడు ప్రకటన చేయండి’ అని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో అభివృద్ధిలో వెనక్కిపోతున్న దేశాలలో భారత్ రెండవ వరస్ట్ కంట్రీ అని అమర్త్యసేన్ విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక రంగంలో 2014 నుంచి ఆ దేశం అపసవ్య దిశలో పయనిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి, ఇతర విషయాల్లో గత నాలుగేళ్లలో ఇంత అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపాలని సవాల్ చేశారు. తాము చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణల ఫలితాలు ప్రతి మనిషికి చేరాయని అన్నా రు. ఈ విషయాలేవీ అమర్త్యసేన్‌కు అర్థం కాకపోతే ఆయన భారత్ వచ్చి కొంత సమ యం గడిపితే వాస్తవంగా జరిగిన అభివృద్ధి అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.