జాతీయ వార్తలు

సాంస్కృతిక వారధి భాష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, నీతి, విజ్ఞానానికి భాష అద్దం పడుతుందని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్ర విద్యా సంస్థ స్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో విద్యాబోధనను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయాలని పిలుపునిచ్చారు. ఆర్.కె.పురంలోని ఆంధ్ర విద్యా సంస్థ నిర్మించిన కొత్త భవనాన్ని దూర నియంత్ర విధానం ద్వారా ఉప రాష్టప్రతి ప్రారంభించారు. అద్భుతమైన సంస్కృతి, వారసత్వానికి మనం వారసులమని, పెద్దలు, ఉపాధ్యాయులను గౌరవించటం మనందరి బాధ్యత అని ఆయన హితవు చెప్పారు. అన్ని జీవులపట్ల సానుభూతి చూపించటం, ప్రకృతి పట్ల భక్తి భారతీయుల నరనరాల్లో ఉన్నదని ఉప రాష్టప్రతి చెప్పారు. ఎవరు ఎన్ని భాషలను నేర్చుకున్నా మాతృభాషను మరిచిపోలేము, విస్మరించలేమని స్పష్టం చేశారు. భాషను పరిరక్షించుకోవటం ద్వారా నాగరికతలోని సభ్యత, సంస్కృతిని కాపాడుకోవాలని అన్నారు. సంస్కృతి ఒక ప్రాంతానికి చెందిన నాగరికత, ప్రవృత్తి, జ్ఞానము, నీతి, నిజాయితీ, ఆచారాలు, సామాజిక కట్టుబాట్లకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకోవటం, పరస్పర అవగాహన, తోటివారి భాషను నేర్చుకోవటం వలన భారతదేశం ఐక్యత, సమైక్యత మరింత బలపడుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. మహిళలు విద్యావంతులు అయ్యేందుకు దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ చేసిన సేవలను ఉప రాష్టప్రతి కొనియాడారు. దేశాభివృద్ది కోసం దుర్గ్భాయ్ చేసిన సేవలను యువత ఆదర్శంగా తీసుకుని తమ వంతు కృషి చేయాలన్నారు. స్వాతంత్య్ర సమర యోధురాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకులిగా ఆమె మనందరికీ ఆదర్శం ప్రాయురాలని అన్నారు. దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ ఢిల్లీకి ఎంతో సేవ చేశారని, ఆమె జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే స్థాపక దినోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రతిభా అవార్డులను అందజేశారు.

చిత్రం..దుర్గాబాయ్ దేశ్‌ముఖ్‌కు నివాళులర్పిస్తున్న ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు