జాతీయ వార్తలు

‘జమిలి’కి రజనీ జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 15: జమిలి ఎన్నికలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ జై కొట్టారు. లోక్‌సభకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజా ధనం వృథా కాదని, సమయం ఆదా అవుతుందన్నారు. జమిలి ఎన్నికలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల వల్ల ప్రయోజనాలను గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పార్టీలు సహకరించాలన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, చెన్నై-సేలం మధ్య ఎనిమిది లైన్ల రహదారి నిర్మాణాన్ని కొన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం తగదన్నారు. గ్రీన్ ఫీల్డ్ రహదారి వల్ల దేశాభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. చెన్నై-సేలం రహదారి ప్రాజెక్టుపై రజనీకాంత్ స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు వల్ల రోడ్డు వెడల్పులో భూములు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

చిత్రం..రోడ్డు పక్కన దొరికిన రూ.50వేలను పోలీసులకు అందించిన బాలుడు మొహమ్మద్ యాసిన్‌ను
అభినందిస్తున్న రజనీకాంత్