జాతీయ వార్తలు

కొత్త మంత్రులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంజె అక్బర్
ప్రముఖ పాత్రికేయుడు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవలే పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్బర్ రాజకీయాలకు కొత్తేమీ కాదు. 1989లో కాంగ్రెస్(ఐ)టికెట్‌పై బిహార్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు మోదీ కేబినెట్‌లో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తరువాత రెండో ముస్లిం ప్రతినిధి అక్బర్.
పిపి చౌదరి
సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది. మోదీ మంత్రివర్గంలో చోటు దొరికిన మరో ప్రముఖుడు. రాజస్థాన్‌లోని పాలి నుంచి లోక్‌సభకు బీజేపి తరపున ఎన్నికైన చౌదరి రాజ్యాంగ పరమైన అన్ని అంశాల్లో మంచి పరిజ్ఞానం ఉన్నవ్యక్తి. రికార్డు స్థాయిలో 11వేల కేసులను వాదించిన ఘనత చౌదరిది. ఎనిమిదేళ్ల వయసులోనే బాల స్వయంసేవక్‌గా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో కార్యకలాపాల్లో భాగస్వామి అయిన చౌదరి తన నియోజకవర్గంలోని 1.31లక్షల మంది మహిళలకు తన సొంత వేతనం నుంచి బీమా సౌకర్యం కల్పించారు.
సుభాష్ భామరె
మరాఠా సమాజం నుంచి వచ్చిన నేత. మహారాష్టల్రోని ధులే నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో శివసేనలో పనిచేశారు. ఈయన తండ్రి కాంగ్రెస్ నేత. మహారాష్టల్రో ప్రముఖ కేన్సర్ సర్జన్‌గా కీర్తిప్రతిష్ఠలు ఉన్న వైద్యుడు. మొదటిసారి ఎంపి అయిన పలు పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయేతర వ్యక్తులను ఎన్నికల బరిలో దింపి విజయం సాధించిన ఎంపిలలో భామరె ఒకరు.
అర్జున్ రామ్ మేఘ్‌వాల్
ఢిల్లీ వీధుల్లో ‘సైక్లింగ్ ఎంపి’గా ప్రసిద్ధుడు. ఢిల్లీలో ‘సరి-బేసి’ విధానం అమలులో ఉన్నప్పుడు పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చి రికార్డు సృష్టించారు. రాజస్థాన్‌లోని బికనీర్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్ను మేఘ్‌వాల్ ప్రముఖ దళిత నాయకుడు కూడా. టెలిఫోన్ ఆపరేటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మేఘ్‌వాల్ ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో సేవలందించారు. రెండు సార్లు ఎంపిగా పనిచేశారు. ప్రస్తుతం లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్నారు.
రాందాస్ అతవాలె
మహారాష్టల్రో అతివాద దళిత నాయకుడు. ఎన్‌డీయేకు మిత్రపక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అతవాలె)కు అధ్యక్షుడు. గతంలో పండరిపూర్, ముంబై నార్త్ సెంట్రల్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన రాందాస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మహారాష్టల్రో ప్రధాన మిత్రపక్షమైన శివసేన నుంచి ఎవరికీ చోటు దక్కకపోవటం, ఇరుపక్షాల మధ్య సంబంధాలు సరిగా లేకపోవటంతో రాందాస్ అథావలెకు మంత్రిపదవి ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది.
మన్సుఖ్ భాయ్ మాండవియ
గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ సీనియర్ నేత. ఇతను కూడా సైకిల్‌ని ఇష్టపడతారు. గుజరాత్‌లో బిజెపి పట్టు సడలకుండా ఉండేందుకు మోదీ-షా ఎత్తుగడలో భాగంగానే మన్సుఖ్‌భాయ్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది.
ఎస్.ఎస్. ఆహ్లూవాలియా
బిజెపిలో సీనియర్ నేత. పంజాబ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆహ్లూవాలియాకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు అనుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజపేయి ప్రభుత్వంలో ఈయన మంత్రిగా పనిచేశారు. బిహార్, జార్ఖండ్‌ల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో విస్తారమైన అనుభవం ఉన్న నేత.
అనిల్ దవె
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనిల్ దవె కూడా సైకిల్ ప్రేమికుడు. విద్యారంగంలో అనేక సేవలు అందించిన దవె, నర్మద నది పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేశారు. బిజెపికి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడు.
పర్‌శోత్తం కొడాభాయ్ రుపాలా
గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నేత. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత నమ్మకస్థుడు. పటేల్ సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
రమేశ్ జిగాజినాగి
దక్షిణ భారత్‌లోని 28 రిజర్వ్‌డ్ నియోజక వర్గాల్లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రతినిధి రమేశ్ జిగాజినాగి. కర్ణాటక లోని బీజాపూర్ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో దళితుల మద్దతు ఎక్కువ ఉన్న నేత. అయిదుసార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. 2018లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీకి నాయకత్వం వహించే అవకాశాలున్నాయి.
మహేంద్రనాథ్ పాండే
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చౌందౌలీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మహేంద్రనాథ్ పాండేకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. యూపీ కే చెందిన కల్రాజ్ మిశ్రాతో పాటు రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడు. యూపి కేబినెట్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. మోదీ నియోజకవర్గం వారణాసిలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
జస్వంత్‌సిన్హ్ భభర్
గుజరాత్‌లోని దహోద్ నియోజక వర్గం నుంచి ఎన్నికైన భభర్ ఆ రాష్ట్రంలో ప్రముఖ గిరిజన నేత. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉన్న గిరిజన ఓటుబ్యాంకును కొల్లగొట్టే వ్యూహంలో భాగంగా భభర్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
ఫగ్గన్ సింగ్ కులస్తె
మధ్యప్రదేశ్‌లోని మాండ్లా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఫగ్గన్ సింగ్ గిరిజన నేత. అటల్‌బిహారీ వాజపేయి ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. 2008లో ఓటుకు నోటు స్కాంలో కులస్తె పేరు ప్రముఖంగా వార్తల్లోకెక్కింది. ఆ తరువాత కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది.
విజయ్ గోయెల్
ఢిల్లీలో ప్రజాదరణ ఉన్న బిజెపి నేత. 2014లో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. భారతీయ జనతాపార్టీలో సైతం అనేక హోదాల్లో సేవలందించారు.
అనుప్రియ పటేల్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అప్నాదళ్ వ్యవస్థాపకుడు సోన్‌లాల్ పటేల్ కుమార్తె. సోమవారమే అప్నాదళ్ బిజెపీలో విలీనమైంది. మీర్జాపూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వారణాసి-మీర్జాపూర్ ప్రాంతంలో కుర్మి సామాజిక వర్గంలో బాగా పలుకుబడి ఉన్న నేత. ఢిల్లీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని అయిన అనుప్రియ తన తల్లి కృష్ణ పటేల్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ విస్తృతమైన ప్రజాదరణ పొందారు. 35 ఏళ్ల పటేల్ త్వరలో జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
రాజేన్ గొహేన్
అస్సాంలోను నాగావ్ నుంచి పలుమార్లు బిజెపి తరపున లోక్‌సభకు ఎన్నికైన నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి శర్వానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లినందున ఆయన స్థానంలో రాజేన్‌కు చోటు కల్పించారు.
సి.ఆర్. చౌదరి
సీనియర్ జాట్ నేత. రాజస్థాన్‌లోని నాగోర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లో ప్రముఖ సామాజిక వర్గమైన జాట్లకు ప్రతినిథిత్వం కల్పించటం కోసం చౌదరికి మోదీ కేబినెట్‌లో స్థానం లభించింది.
అజయ్ తమ్టా
ఉత్తరాఖండ్‌లో గ్రామ పంచాయతి నుంచి కేంద్ర మంత్రి పదవిదాకా ఎదిగిన నేత. త్వరలో ఉత్తరాఖండ్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అజయ్‌తమ్టాకు కేబినెట్ బెర్త్ ఖరారు చేశారు. హరీశ్‌రావత్ ప్రభుత్వాన్ని ఓడించి పార్టీని అధికారంలోకి తేవటానికి తమ్టాకు మంత్రిపదవి దోహద పడుతుందని అంచనా.
కృష్ణరాజ్
అనుప్రియ పటేల్‌తో పాటు మోదీ మంత్రివర్గ విస్తరణలో ప్రమాణం చేసిన మరో మహిళ. ఉత్తరప్రదేశ్ నుంచి షాజహాన్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన దళిత నేత. బిజెపి ప్రస్తుతం అమలు చేస్తున్న మిషన్ యూపిలో భాగమే కృష్ణరాజ్‌కు మంత్రిపదవి ఇవ్వటం.