జాతీయ వార్తలు

అంచనాలు తలకిందులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ మరికొందరు మంత్రుల శాఖలు మార్చివేయటం ద్వారా షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. మంత్రివర్గం విస్తరణలో క్యాబినెట్ మంత్రులను చేర్చుకుని పాత మంత్రుల శాఖలను ప్రధాని పెద్దగా మార్చకపోవచ్చుననుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఇంత కాలం అత్యంత ముఖ్యమైన మానవ వనరుల శాఖను నిర్వహించిన స్మృతి ఇరానీని జౌళి శాఖకు పరిమితం చేయటం గమనార్హం. ప్రకాశ్ జవడేకర్‌కు మానవ వనరుల శాఖ లభించింది. అందరు అనుకున్నట్లే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వద్ద అదనంగా ఉన్న సమాచార శాఖను తొలగించి ఎం.వెంకయ్యనాయడుకు ఇచ్చారు. వెంకయ్యనాయుడు ఇంత కాలం నిర్వహించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తొలగించారు. అయితే పట్టణాభివృద్ది తదితర పాత శాఖలు ఆయన వద్దే ఉంటాయి. రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, మనోహర్ పరిక్కర్, ఉమాభారతి, నితిన్ గడ్కరీ,సురేష్ ప్రభు శాఖల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు స్టాటిస్టిక్స్,ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ శాఖను కేటాయించారు. ఎరువులు, రసాయనాల శాఖను నిర్వహిస్తున్న ఆనంతకుమార్‌కు అదనంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు న్యాయ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాను పౌరవిమాన శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.