జాతీయ వార్తలు

ముదురుతున్న ‘జకీర్’ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: వివాదాస్పద భారతీయ ఇస్లాం మతపెద్ద జకీర్ నాయక్ ప్రసంగాలు ఢాకా ఉగ్రవాదులకు ప్రేరణ కలిగించాన్న అంశం రోజురోజుకూ రాజుకుంటోంది. జకీర్ నాయక్‌పై తగిన చర్య తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో ఈ అంశం ఇంకా వేడెక్కింది. గత వారం ఢాకాలో 22మందిని హతమార్చిన ఉగ్రదాడిలో పాల్గొన్న కొందరు టెర్రరిస్టులకు జకీర్ నాయక్ ప్రసంగాలు ప్రేరణ ఇచ్చాయన్న వార్త తీవ్రంగా పరిగణించదగిందని.. ఇలాంటి ప్రసంగాలు ఎంతమాత్రం సహించరానివని కేంద్రం స్పష్టం చేసింది. ముంబైలో ఉండే నాయక్‌పై కేంద్ర హోం శాఖ నిఘా పెంచింది. దోంగ్రీ ప్రాంతంలోని నాయక్‌కు చెందిన ‘ఇస్లామిక్ రీసర్చ్ ఫౌండేషన్’ పరిసర ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా భద్రతాబలగాలను మోహరించారు. ‘‘కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అతని ప్రసంగాలను అధ్యయనం చేస్తోంది. ఆ తరువాత తగిన చర్య తీసుకుంటోంది. మీడియా రిపోర్ట్ చేసినట్లుగా అతని ప్రసంగాలు ఉంటే అవి తీవ్రంగా ఆక్షేపణీయమైనవి.’’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ బాధ్యతలు కొత్తగా చేపట్టిన సీనియర్ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మరోవైపు 2012లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ నాయక్‌తో కలిసి ఒక మత సామరస్య కార్యక్రమంలో పాల్గొని అతణ్ణి పొగుడుతున్న వీడియో క్లిప్పింగ్‌ను బిజెపి విడుదల చేసింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకం: నాయక్
మరోవైపు తన ప్రసంగాలను మీడియా వక్రీకరించిందని జకీర్ నాయక్ అన్నారు. ముస్లింలు అందరూ టెర్రరిస్టులుగా మారాలని తాను అన్న మాటల్ని పొరపాటుగా మరో అర్థంలో పేర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ‘‘నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకున్నప్పుడల్లా మీడియా ఈ క్లిప్పింగ్ చూపిస్తుంది. ఈ మాటలు అన్నది నేనే. కానీ.. అందులోని పరమార్థం వేరు. నేనేమన్నానంటే టెర్రరిస్టు అంటే ఒకరిని భయాందోళనలకు గురిచేసే వాడు అని అర్థం. ఓ పోలీసు దొంగను భయపెడతాడు. అదే విధంగా సంఘ వ్యతిరేక శక్తుల పట్ల ప్రతి ముస్లిం టెర్రరిస్టుగా మారాలనే నేనన్నాను’ అని ఆయన వివరణ ఇచ్చారు.