జాతీయ వార్తలు

నేడు ఢాకాకు ఎన్‌ఎస్‌జి బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: వారం రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ చోటుచేసుకున్న రెండు ఉగ్ర దాడులను విశే్లషించి అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులు కలిగిన భారత ఎన్‌ఎస్‌జి బృందం శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్లనుంది. బాంబు పేలుళ్లను విశే్లషించడంలో నైపుణ్యం కలిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) అధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 1న ఢాకాలోని బేకరీలో ఉగ్రవాదులు జరిపిన ఊచకోత ఘటనతోపాటు, కిశోర్‌గంజ్ జిల్లాలో గురువారం జరిగిన బాంబు దాడిని ఈ బృందం విశే్లషించనుంది. దాడులు జరిగిన ప్రాంతాలను సందర్శించి అధ్యయనం చేయనుంది. దాడులు జరిగిన తీరును, ఉగ్రవాదులు సహకరించుకున్న వైనంతోపాటు స్థానికంగా సహకారం పొందిన విధానంపై అధ్యయనం చేయాలని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ విశే్లషణ వల్ల ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాయి. శుక్రవారం ఢాకా బయలుదేరనున్న నిపుణుల బృందం రెండు మూడు రోజులపాటు అధ్యయనం చేయనుంది. ఉగ్ర దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎన్‌ఎస్‌జి బృందాలు గతంలోనూ విదేశాల్లోనూ పర్యటించాయి.