జాతీయ వార్తలు

కొత్త ఆవిష్కరణలు జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త అనే్వషణలు, పరిశోధనలు కరవై భారత విద్యారంగంలో స్తబ్దత నెలకొందని అన్నారు. గురువారం ఇక్కడ కేంద్ర మానవ వనరుల మంత్రిగా జవడేకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పాఠశాలల్లో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం ద్వారా వారిని నిరుత్సాహానికి గురిచేస్తున్నారని ఆయన అన్నారు. దీనివల్ల తెలుసుకోవాలన్న జిజ్ఞాస విద్యార్థుల్లో కొరవడుతుందని, తద్వారా ఎలాంటి మార్పులకు ఆస్కారం ఉండడం లేదని జవడేకర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు కృషి చేస్తోందని, నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ‘విద్యార్థులకు ప్రశ్నించే అవకాశం మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దేశంలో పరిశోధనలు ఎందుకు నోచుకోవడం లేదు? ఔత్సాహికులను ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నాం?’ అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థి దేని విషయమైనా తెలుసుకోవాలని టీచర్‌ను అడిగితే వెంటనే కూర్చోమన్న సమాధానం వస్తోందని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని జవడేకర్ చెప్పారు. ఉత్సాహవంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి ఈ మార్పు రావాల్సి ఉందని ఆయన ఉద్ఘాటించారు. అప్పుడే కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని, విద్యార్థుల్లోనూ పరివర్తన చూడగలమని హెచ్‌ఆర్‌డి మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్థిరమైన అభివృద్ధికోసం కృషి చేస్తున్నారని జవడేకర్ చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం పనిచేస్తోందని వివరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రిత్వశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జిఐఎస్) మ్యాపింగ్, ఫాకల్టీల్లో ఖాళీల భర్తీ తదితర అంశాలపై జవడేకర్ చర్చించారు.
స్మృతి ఇరానీ గైర్హాజర్
జవడేకర్‌కు బాధ్యలు అప్పగించాల్సి ఉన్న స్మృతి ఇరానీ డుమ్మాకొట్టారు. ఇప్పటివరకూ మానవ వనరుల మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ పోర్టుపోలియో మారింది. జౌళిశాఖ మంత్రిగా ఇరానీ బుధవారమే బాధ్యతలు స్వీకరించారు. గురువారం జవడేకర్‌కు ఆమె బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. స్మృతి ఇరానీ గైర్హాజరిపై జవడేకర్‌ను మీడియా ప్రశ్నించగా కుటుంబ కారణాల వల్లే ఆమె రాలేకపోయారని చెప్పుకొచ్చారు.