జాతీయ వార్తలు

చెత్త నుంచీ ఆదాయం పొందుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. స్టేషన్లలో పేరుకుపోతున్న చెత్తను వేలం వేయాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. ‘కిలో చెత్త 1.50 పైసల చొప్పున స్టేషన్లలో సేకరించుకునేలా వేస్టేజ్ మేనేజ్‌మెంట్ గ్రూపునకు అప్పగిస్తాం’ అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నాన్ టారిఫ్ ఆదాయ మార్గాలపై దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు. చెత్తసేకరణకు సంబంధించి హక్కులు దక్కించుకున్న సంస్థ నిర్దేశించిన స్టేషన్లలో రేయింబవళ్లూ చెత్తను సేకరించుకోవచ్చు. ఎక్కడా చెత్త కనిపించకుండా చేయాల్సిన బాధ్యత సంబంధిత సంస్థకే ఉంటుందని ఆ అధికారి చెప్పారు. స్టేషన్లలో సేకరించిన చెత్తను ఇంధనంగానూ ఎరువుగానూ వాడుకుంటారు. అంతేకాదు చెత్త సేకరించే సమయంలో దురదృష్టవశాత్తూ పనివాళ్లు ప్రమాదానికి గురైన పక్షంలో బీమా సదుపాయం కల్పించే ప్రతిపాదన ఉంది. ఇది సంబంధిత వేస్ట్ మేనేజ్‌మెంట్ గ్రూపు చూసుకోవాలని సీనియర్ అధికారి స్పష్టం చేశారు.