జాతీయ వార్తలు

తెలంగాణలో పార్టీని పటిష్టం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్యకు చెప్పారు. ఎల్లయ్య గురువారం సోనియాగాంధీని కలిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల గురించి వివరిస్తూ ఒక లేఖను అందజేశారు. సోనియాగాంధీ ఆయన చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి అవగతమైందనీ, కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎల్లయ్య చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఎంపీతోపాటు పలువురు శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు తమ స్వార్థ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే టిఆర్‌ఎస్‌లో చేరారని ఆయన పార్టీ అధ్యక్షురాలికి చెప్పారు. నియంతగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యమించాల్సిన తరుణం వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు మొదట టిపిసిసి కార్యవర్గ సమావేశాన్ని ఎఐసిసిలో ఏర్పాటుచేసి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. టిపిసిసి పని తీరును స్వయంగా సోనియా గాంధీయే సమీక్షించాలని ఎల్లయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తెలంగాణలోని ప్రతి జిల్లాలో రెండు, మూడు రోజులుండి సమీక్షలు జరపాలన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ప్రతి రెండు నెలలకు ఒక సారి టిపిసిసి పనితీరుపై నివేదికలు తెప్పించుకోవాలని లేఖలో సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది, అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటల మూలంగా సమర్థంగా పని చేయలేకపోతున్నామని నంది ఎల్లయ్య పార్టీ అధ్యక్షురాలికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటుచేస్తే ప్రత్యేక రాష్ట్రం తమవల్లనే ఏర్పడిందని టిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.