జాతీయ వార్తలు

నిపుణుల సేవలు తీసుకుంటాం: ‘ఆప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: మంజూరయిన అధికారుల సంఖ్యలో కేవలం 40 శాతం మందితో పని చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసుకోవడానికి నిపుణుల సేవలను తీసుకుంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. గురువారం అన్ని దినపత్రికల్లో ఇచ్చిన పూర్తి పేజి ప్రకటనల్లో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రకటనల ద్వారా ఇటీవల తొమ్మిది మంది అధికారులను ఢిల్లీనుంచి బదిలీ చేయడంపై ఆప్ ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేసింది. నగర పాలనను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే కేంద్రం ఈ అధికారులను బదిలీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ అంశంపై కానీ, తన ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్రకుమార్‌ను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేయడంపై కాని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే సిసోడియా రెండుసార్లు మీడియా నుద్దేశించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రకటనల్లో సైతం ఆయన ఫోటో మాత్రమే ఉంది.
‘్ఢల్లీకోసం మంజూరయిన అధికారుల పోస్టులు 309 కాగా, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 165 మందిని మాత్రమే ఇచ్చింది. వీరిలో ఎనిమిది మందిని ఇప్పుడు అవసరం లేకపోయినా అండమాన్‌కు పంపించారు. నిజానికి అండమాన్‌లో 24 పోస్టులుంటే వాటిలో 23 పోస్టులను ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ అవసరానికి మంచి ఉన్నారు. ఢిల్లీలో ఇప్పుడు మంజూరయిన ఆఫీసర్ల సంఖ్యలో 40 శాతం మంది మాత్రమే ఉన్నారు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఢిల్లీ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లి తీరుతామన్న సిసోడియా సందేశం కూడా ఆ ప్రకటనలో ఉంది. ‘మీరు మాకు భారీ ప్రజా తీర్పు ఇచ్చారు. పని చేయడానికి వాళ్లు అధికారులను ఇవ్వకపోతే మీలోనుంచే నిపుణుల సేవలను తీసుకుంటాం. ఎందుకంటే ఢిల్లీలో నిపుణులకు కొరత లేదు’ అని కూడా ఆ ప్రకటనలో సిసోడియా పేర్కొన్నారు. బదిలీ చేసిన అధికారులందరూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారేనని పేర్కొన్న ప్రకటన దేశ చరిత్రలో ఇప్పటివరకు ముఖ్యమంత్రిని సంప్రదించకుండా ఏ సిఎం వ్యక్తిగత సిబ్బందిని బదిలీ చేయలేదని కూడా ఆరోపించింది.