జాతీయ వార్తలు

చట్టాన్ని సమీక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: ఢిల్లీ, చెన్నైలలో హింసాకాండకు పాల్పడడం అలాగే తెలంగాణలో సమ్మెకు దిగిన అంశాల నేపథ్యంలో దేశంలో న్యాయవాద వృత్తికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు కోరింది. న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అదే విధంగా న్యాయవాద వృత్తికి సంబంధించిన చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకుని తగిన సిఫార్సులు చేయాలని కోరింది. సాధ్యమైనంత త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని కూడా స్పష్టం చేసింది. లా కమిషన్ సిఫార్సులు అందిన తరువాత ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోగలదన్న ఆశాభావాన్ని న్యాయమూర్తి ఆర్ దవే సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యక్తం చేసింది. లాయర్లకు వర్తించే అడ్వొకేట్ల చట్టాన్ని కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యూపీకి చెందిన ఓ అడ్వొకేట్ ఈటాలోని ఓ సివిల్ జడ్జిని బెదిరించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మహిపాల్ సింగ్ రాణా అనే ఈ అడ్వొకేట్‌ను దోషిగా పరిగణిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు బెంచ్ ధృవీకరించింది. ధిక్కార నేరానికి తగిన శిక్షను అనుభవించేవరకూ ఆ అడ్వొకేట్‌ను ఈటా కోర్టుకు అనుమతించవద్దని కూడా స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో తక్షణ ప్రాతిపదికన అడ్వొకేట్ల చట్టాన్ని సమీక్షించిన నియంత్రణ చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని తెలిపింది. న్యాయవృత్తి అన్నది పరిపూర్ణరీతిలో సాగాలని ఏరకంగానూ ఇందులో లోపం ఉండడానికి వీల్లేదని ధర్మాసరం పేర్కొంది. ఈరకమైన ఘటనలు జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థ నిగ్గుతేలాలని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో యూపీ బార్ కౌన్సిల్ అలాగే భారత బార్ కౌన్సిల్ సరైన రీతిలో వ్యవహరించలేదని చెప్పింది.