జాతీయ వార్తలు

ఎక్కడి వాహనాలు అక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్ట్రంలో మరాఠీలు చేపట్టిన చేపట్టిన ప్రత్యేక రిజర్వేషన్ల ఉద్యమం తారస్థాయి చేరుకుంది. గురువారం ఇచ్చిన సమ్మె పిలుపుతో నిరసనకారులు రహదారులను దిగ్బంధం చేశారు. వందతుల నేపథ్యంలో పూనే జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించాలని మరాఠా నాయకులు పిలుపునిచ్చారు. రహదారులపై రాకపోకలను నిలిపివేశారని అధికారులు వెల్లడించారు. అనేక చోట్ల రోడ్లపై టైర్లు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఔరంగబాద్ జిల్లా కాంత్రి చౌక్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. శివసేన అథినేత ఉద్దవ్ థాక్రేకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలే ఘర్షణకు కారణమయ్యాయని అధికారులు తెలిపారు. ఘర్షణలో ఒకరు గాయపడ్డారని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్పారు. పూనే జిల్లా కలెక్టర్ ఆఫీసు గేటును ఆందోళన కారులు ధ్వంసం చేశారు. అలాగే కేబిన్, విద్యుత్ దీపాలను ధ్వంసం చేశారు. బారామతిలోని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఇంటివద్ద ఆందోళనకారులు బైఠాయించారు. లాతూరు, జల్నా, సోలాపూర్, బుల్ధానా జిల్లాల్లో బస్సులు, వాహనాలను ఎక్కడికక్కడే ఆపేశారు. పూనే-హైదరాబాద్ హైవే 9ను దిగ్బంధం చేశారు. జల్నా, అహ్మద్‌నగర్ జిల్లాలో దిష్టిబొమ్మలు దహనం జరిగింది. కొల్హాపూర్ శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ అబిత్కర్‌ను ముంబయిలో ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రకాష్ విధాన్ భవన్‌లోకి వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద ధర్మాకు దిగారు. సకల్ మరాఠా సమాజ్ బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే నవీ ముంబయిని బంద్ నుంచి మినహాయించారు. గతనెలలో మరాఠీలు చేపట్టిన ఉద్యం హింసాత్మకంగా మారింది. దీంతో ఈసారి అక్కడ బంద్‌ను మినహాయించారు. అయితే మరోవర్గం నవీ ముంబయి సబర్బన్ కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్మా చేస్తామని ప్రకటించడంతో భారీగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్, భద్రతాదళాలను మోహరించారు. నవీ ముంబయిలో మాత్రం ప్రభుత్వ వాహనాలు, రైళ్లు మామూలుగానే నడిచాయి. ముంబయి- పూనే ఎక్స్‌ప్రెస్ హేవే, ముంబయి- గోవా హైవేలోని కలంబొలీ వద్ద భారీగా సాయుధ బలగాలు మోహరించాయి. నిత్యవసర సర్వీసులను బంద్ నుంచి మినహాయించినట్టు ఆందోళనకారులు ప్రకటించినా సమ్మె ప్రభావం ఎక్కువగానే కనిపించింది. సతారాలోని అన్ని పెట్రోల్ బంకులు, కూరగాయల మార్కెట్లు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
చిత్రాలు..బంద్ పాటిస్తున్న మరాఠా క్రాంతి మోర్చా నాయకులు,
*గురువారం నాటి బంద్‌లో భాగంగా ర్యాలీలో పాల్గొన్న యువతులు, మహిళలు