జాతీయ వార్తలు

రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషులు ఏడుగురికి క్షమాభిక్ష పెట్టి విడిచిపెట్టాలన్న తమిళనాడు ప్రభుత్వ వినతిని కేంద్రం అంగీకరించడం లేదని, ఈ చర్య అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఇది ఒక ప్రమాదకర దృష్టాంతంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. దీంతో జస్టిస్ రంజన్ గోగయ్నవీన్ సిన్హా, కెఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర హోమ్ అఫయిర్స్ శాఖ సమర్పించిన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసి కేసును వాయిదా వేసింది. రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితులు ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం 2016 జనవరి 23న కోర్టును కోరింది. అయితే దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరని, 2015లో సుప్రీం ఇచ్చిన ఆదేశం మేరకు కేంద్రం మూడు నెలల్లో తన నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేయాలని కోర్టు 2016 మార్చి రెండున కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై ఎంహెచ్‌ఏ జాయింట్ సెక్రటరీ విబి దుబే కోర్టుకు సమాధానమిస్తూ క్రిమినల్ ప్రొసీజర్ 1973లోని సెక్షన్ 435 ప్రకారం నిందితులను విడిచిపెట్టాలన్న తమిళనాడు ప్రభుత్వ వినతిని తిరస్కరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు నిందితులకు సహేతుకమైన కారణాలతో మరణశిక్ష విధించిందని, సుప్రీం కోర్టు సైతం నిందితులది అసాధారణమైన చర్య అని వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. రాజీవ్ హత్యలో నలుగురు విదేశీయులు సహా 15 మంది పాల్గొన్నారని,
వీరిలో పోలీస్ అధికారులు, ముగ్గురు భారతీయులు సైతం ఉన్నారన్నారు. మాజీ ప్రధానిని పాశవికంగా హత్య చేసిన దోషులకు క్షమాభిక్ష పెట్టి విడిచిపెడితే ఈ దృష్టాంతం ప్రపంచదేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఉగ్రవాదులకు భవిష్యత్‌లో ఇది ఊతం ఇచ్చినట్టు అవుతుందని, విదేశీ ఉగ్రవాద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ హత్య కేసు దోషులకు శిక్ష పడాల్సిందేనని పేర్కొన్నారు.
ఇలావుండగా 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లోని ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొనడానికి వచ్చిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ధాను అనే మహిళ మానవబాంబు రూపంలో హత్య చేసింది. ఈ సంఘటనలో ధాను సహా 14 మంది మృతి చెందారు. దేశంలో ఒక ఉన్నతస్థాయి నేతను ఇలా హత్య చేయడం దేశంలోనే ప్రథమం కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన దోషులు వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, టి.సుదేంద్రరాజా అలియాన్ సంతం, ఏజి పెరారివలన్ అలియాస్ అటివు, జయకుమార్, రాబార్ట్ పయాస్, పి.రవిచంద్రన్, నళిని గత 25 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. 2014 ఫిబ్రవరి 18న సుప్రీం కోర్టు మురుగన్, సంతన్, పెరారివలన్‌లకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్ష పడిన మరునాడే అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పటి కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ నిందితులకు విధించిన శిక్షపై క్షమాభిక్ష విషయమై పరిశీలించాలని కోరింది. దీనికి కేంద్రం బదులిస్తూ క్షమాభిక్ష అంశం తమ పరిధిలోనిది కాదని, ఈ విషయం కోర్టే నిర్ణయించాలని పేర్కొంది. తర్వాత 2014 ఫిబ్రవరి 21న ఈ కేసును ఐదుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ కేసులో కుట్ర దాగి ఉందని, ఒక విదేశీ ఉగ్రవాద సంస్థ పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడింది కాబట్టి నిందితులకు ఎలాంటి క్షమాభిక్ష పెట్టరాదని కేంద్రం కోర్టును కోరింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్రాలకు నిందితులను విడుదల చేసే అధికారం ఉన్నందున తామే వారిని విడుదల చేస్తామని, రాజకీయ కారణాల వల్లే కేంద్రం వారికి క్షమాభిక్ష పెట్టడం లేదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు డిసెంబర్ 2, 2015 రాష్ట్రాలు నిందితులను విడుదల చేసే విషయంలో కేంద్రానికి ఆయా రాష్ట్రాలపై సర్వోతృష్టత ఉంటుందని, కాబట్టి దోషులకు క్షమాభిక్ష పెట్టేవిషయంలో కేంద్రం అనుమతి తప్పనిసరని పేర్కొంది. అలాగే రాజీవ్‌గాంధీ హత్యకేసుకు సంబంధించి ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని 2017లో తమిళనాడు ప్రభుత్వం, దోషి పెరారివలన్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కొట్టివేసింది.