జాతీయ వార్తలు

హోదాపై నిలదీశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 10: పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాటం మూలంగా ఆంధ్రప్రదేశ్‌కి బీజేపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని దేశ ప్రజలందరికి తెలిసేలా చేశామని తెలుగు దేశం పార్లమెంటరీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రకు జరిగిన అన్యాయంపై తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానం, రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుపై దేశంలోని అన్ని పార్టీల అనుకూలంగా మాట్లాడాయని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత భూభాగంలో ఉందని బీజేపీ మరచి పోయిందని ఆరోపించారు. విభజన హామీలపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఏపీ విషయంలో సత్యానికి దూరంగా బీజేపీ ప్రభుత్వం మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన ప్యూహరచన చేయడంలో విఫలమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీల అమలు కోసం బీజేపీపై ప్రజా క్షేత్రంలో తెల్చుకుంటామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ లోకసభ పక్ష నాయకుడు
తోట నరసింహం మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా అన్ని విధాలుగా నిలదీశామని పేర్కొన్నారు.
కొనసాగిన ఆందోళన
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు శుక్రవారం కూడా తమ ఆందోళన చేపట్టారు. ఉదయం పార్లమెంట్ ప్రారంభానికి ముందే గాంధీ విగ్రహం వద్ద ఏపీకి న్యాయం చేయలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ సభ లోపలా, బయటా.. ఎక్కడ అవకావం వచ్చినా ఏపీ సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.
విచిత్ర వేషధారణలో ఎంపీ శివప్రసాద్.
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని పార్లమెంట్‌లో ప్రతిరోజు విచిత్ర వేషధారణలో ఆందోళన తెలిపుతున్న ఎంపీ శివప్రసాద్ శుక్రవారం ‘ట్రాన్స్ జెండర్ వేషంలో కేంద్రంపై నిరసన వ్యక్తం చెశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని వేషాలేసినా ప్రధాని మోదీ మనసు కరగడం లేనందునే ఇక తప్పక ట్రాన్స్ జెండర్ వేషం వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నా నరేంద్ర మోదీ ఇప్పుడు అవన్నీ మరిచిపోవడం దారుణమని మండిపడ్డారు. రోజుకోక వేషంలో నిరసన తెలుపుతున్న శివప్రసాద్‌ను శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ అభినందించారు.

చిత్రం..టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ను పలకరిస్తున్న సోనియా గాంధీ