జాతీయ వార్తలు

దలైలామా క్షమాపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 10: భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారనే ప్రకటన చేసినందుకు టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ఒక ప్రకటనలో క్షమాపణలు తెలిపారు. మహమ్మద్ అలీ జిన్నా దేశ ప్రధానిగా ఉంటే బాగుంటుందని మహాత్మాగాంధీ ఆకాంక్షించారని దలైలామా ఇటీవల అన్నారు. మహాత్మాగాంధీ ఆకాంక్ష ఫలించి ఉంటే భారతదేశం విభజన జరిగి ఉండేదని కాదన్నారు. తాను చేసిన ఈ ప్రకటన వివాదస్పదమైందన్నారు. తాను ఇటువంటి ప్రకటన చేయడం తప్పేనని ఆయన చెప్పారు. గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్‌లో జరిగిన కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ మహాత్మాగాంధీ కోరుకున్నట్లుగా జిన్నా ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదన్నారు. తాను ప్రధాని కావాలన్న లక్ష్యంతో గాంధీ ఆకాంక్ష ఫలించకుండా నెహ్రూ అడ్డుపడ్డారని దలైలామా చెప్పారు. ఈ వివాదస్పద ప్రకటనపై దలైలామా తాజాగా స్పందిస్తూ, పండిత నెహ్రూ తనకు బాగా తెలుసని అనుభవశాలి అన్నారు. ప్రతిభావంతుడని, కాని కొన్నిసార్లు కొన్ని తప్పులు దొర్లుతుంటాయన్నారు. ఇక్కడ శుక్రవారం జరిగిన థ్యాంక్యూ కర్నాటక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టిబెట్ ఏర్పాటుకు నెహ్రూ పూర్తిగా మద్దతు ఇచ్చారన్నారు. టిబెట్ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు టిబెట్ స్కూలును ఏర్పాటు చేయాలని నెహ్రూ కోరారన్నారు. వెంటనే అప్పటి విద్యా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో మైసూరు ప్రభుత్వం ముందుకు వచ్చి తమ స్కూలు ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించిందన్నారు. తమ సమస్యకు మహానాయకుడు నిజలింగప్ప చొరవ తీసుకున్నారన్నారు.