జాతీయ వార్తలు

తుంగభద్రకు వరద వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, ఆగస్టు 10: తుంగభద్ర రిజర్వాయర్‌కు వరద మరింత పెరగడంతో 20 గేట్ల గుండా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి వరద వేగంగా పెరుగుతోంది. దీంతో శుక్రవారం జలాశయం 20 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువ నదిలోకి 40,909 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 10 క్రస్ట్‌గేట్లు 1 అడుగు మేర, మరో 10 క్రస్ట్‌గేట్లు 2 అడుగుల మేర ఎత్తారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1632.20 అడుగులుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 35,137 క్యూసెక్‌లు కాగా ఔట్‌ఫ్లో 40.909 క్యూసెక్కులు. జలాశయంలో 97.78 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

చిత్రం..వరద నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం