జాతీయ వార్తలు

బాల్య వివాహాలను నిరోధించేలా చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలో బాల్యవివాహాల నిషేధ చట్టం కింద కొత్త నిబంధనలపై చట్టాలను ఉత్తరప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలు రూపొందించాల్సి ఉందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి మేనకా గాంధీ లోక్‌సభకు చెప్పారు. బాల్యవివాహాలను నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించిన ట్లు చెప్పారు. బాల్యవివాహాల నిషేధ చట్టం 2006 కింద రాష్ట్రప్రభుత్వాలు చట్టాలను రూపొందించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని శుక్రవారం లోక్‌సభలో ఆమె వెల్లడించారు. ఈ చట్టా న్ని ఆ రాష్ట్రాలు అమలు చేయాలని నిర్ణయించాయని, కాని కొత్త నిబంధలను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంటుందన్నా రు. బాల్యవివాహాల నిషేధ చట్టం కింద 619 కేసులను నమో దు చేసినట్లు చెప్పారు. తమిళనాడులో ఎక్కువగా 132, కర్నాటకలో 86 బాల్య వివాహాల కేసులను నమోదు చేశారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత్‌లో బాల్యవివాహాలు గత పదేళ్లలో 27 శాతం మేర తగ్గాయి.