జాతీయ వార్తలు

విభజన హామీలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్,తెలంగాణల మధ్య నెలకోన్న సమస్యలను పరిష్కరించేందుకుగాను కేంద్రానికి తగిన విధంగా సిఫార్సు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విభజన హామీలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలో అమలు కావాల్సిన 14 ప్రధాన అంశాలతో కూడిన పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణ స్థారుూ సంఘానికి వివరించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు, జప్తుచేసిన విభజన చట్టంలోని షేడ్యూలోని అస్తులను విడుదల చేయడం,హైదారాబాద్‌లోని ఏ.పీ విడిచి వెళ్లిన ఆస్తులను తెలంగాణకు అప్పగించాలని స్థారుూ సంఘాన్ని తెలంగాణ కోరింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అధ్యక్షతన హోంశాఖ సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం పార్లమెంట్‌లో శుక్రవారం జరిగింది.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంచిన తెలంగాణ రాష్ట్రానికి అమలు కావాల్సిన అంశాలపై స్థారుూ సంఘం సభ్యుడు బీబీ పాటిల్,తెలంగాణ ప్రభుత్వం ప్రదాన కార్యదర్శి ఎస్‌కే జోషి,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా,విభజన వ్యవహారాల ప్రిన్సిపల్ కార్యదర్శి రామకృష్ణరావు,వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణలోని ఏడు మండలలను కలపడం వల్ల భద్రాచలం,పినపాక,అశ్వారావుపేట ఏస్టీ నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందని,నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభిచాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటు,రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్,్ఢల్లీ ఏపీ భవన్ విభజన,విభజన చట్టలోని షెడ్యూల్ ఏడులోని సంస్థల నిధులు జనాబా ప్రాతిపదికన పంచాలని,ఏపీ బిల్డింగ్స్ కనస్ట్రక్షన్స్ వెల్పెర్ బోర్డు నిధుల్లో తెమంగాణకు 455.75 కోట్ల రూపాయలు రావల్సింది ఏపీఎస్ ఆర్టీసి,ఏపీ ఫుడ్స్,ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డవలప్‌మెంట్ కార్పొరేషన్,ఏపీ డెయిరీ డవలప్‌మెట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెట్‌లు హెట్‌క్వారర్స్ నిర్వహించడం,షెడ్యూల్ తొమ్మిదిలోని సంస్థల విభజన,ఉమ్మడి విద్యుత్‌సంస్థల విభజనలపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను పరిశీలించాలని స్థారుూ సంఘాన్ని తెలంగాణ కోరింది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని,గిరిజన ,ఉద్యాన యూనివర్సిటిలు ఏర్పాటు,4000 మెగావాట్ల విద్యత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు,బయ్యరంలో ఉక్కపరిశ్రమ ఏర్పాటు,కాజిపెట్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర అంశాలపై తెలంగాణ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ స్థారుూ సంఘానికి ఇచ్చింది. గత సమావేశంలో విభజన చట్టానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన హామీల అమలుపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది తెలిసిందే.