జాతీయ వార్తలు

కేరళను ముంచెత్తిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 10: భారీవర్షాలు, వరదలతో కేరళలో ప్రజాజీవనం స్తంభించింది. వరదలు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఇంతవరకు 26మంది మరణించారు. ఇందులో 11 మంది కొండ చరియలు విరిగిపడి మృతి చెందినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఇదుక్కి రిజర్వాయర్ పొంగి ప్రవహించడంత గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి పర్యాటకులను అనుమతించడంలేదు. కేరళలోని ఉత్తర జిల్లాల్లో వరదల వల్ల నీట చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ఆర్మీని రంగంలోకి దింపారు. కోజికోడ్, వాయనాడ్ జిల్లాలో తీవ్రంగా నష్టం సంభవించింది. పెరియార్ నదిలో వరద ఉధృతి పెరిగిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని సదరన్ నావల్ కమాండ్ రాష్ట్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మున్నార్‌లోని ప్లమ్ జూడీ రిసార్టులో దాదాపు 30 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో, ఎక్కడికక్కడ ప్రజా జీవనం అతలాకుతలమైంది. కొంత చరియలు విరిగిపడుతున్నాయని, వీటి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఆర్మీ సహాయం కోరినట్లు పర్యాటక శాఖమంత్రి కె సురేంద్రన్ చెప్పారు. పెరిగాయర్, చెరితోని నదులు పొంగి ప్రవహించడంతో ముందస్తు చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నామన్నారు. ఇడుక్కి డ్యాం గేట్లను పూర్తి స్థాయిలో 26 ఏళ్ల తర్వాత తెరిచారు. ఇక్కడ 2401.34 అడుగుల నీరు చేరింది. ప్రజలను పల్లపు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించేందుకు నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్‌గార్డ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాల సహాయం తీసుకున్నట్లు చెప్పారు. ఆగస్టు 12వ తేదీ వరకు ముఖ్యమంత్రి విజయన్ అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాకుండా రద్దు చేసుకున్నారని, సహాయ చర్యలను సమీక్షిస్తారని మంత్రి చెప్పారు. కాగా వర్షాలతో అతలాకుతలమై తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకుటామని, అవసరమైనసహాయాన్ని అందిస్తామని పాండిచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి చెప్పారు.

చిత్రం..ఏరియల్ వ్యూలో భారీ వర్షాల తర్వాత నీట మునిగిన అలూవా