జాతీయ వార్తలు

పెళ్లి కోసం ఊరు పేరు మార్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్, ఆగస్టు 10: పెళ్లిళ్లు కావడం లేదని ఓ ఊరు పేరే మార్చేసిన వింతైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది! రాజస్థాన్‌లోని మియాక గ్రామంలో యువకులకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో గ్రామస్థులంతా ఏకమయ్యారు. ఊర్లో రహదారులు, ఆస్పత్రులు, రవాణా సౌకర్యం ఇలా అన్ని ఉన్నా యువకులకు పెళ్లి కావడం లేదని, ఇందుకు ప్రధాన కారణం తమ ఊరి పేరేనని తేల్చేశారు. ఊరి పేరు ముస్లిం పేరుగా ఉండడంతోనే తమ కొడుకులకు పెళ్లి కోసం ఎవరూ పిల్లలను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని అధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నారు. దీంతో అధికారులు కూడా వారి విజ్ఞప్తిని అర్థం చేసుకొని మియాక పేరుతో ఉన్న గ్రామాన్ని మహేశ్‌నగర్‌గా మార్చారు. తమ బాధను అర్థం చేసుకొని ఊరు పేరు మార్చడంతో గ్రామస్థులు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే హర్మీర్‌సింగ్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం గ్రామం పేరు మహేశ్‌నగర్‌గానే ఉండేదని, కాలక్రమేణా మియాక మారిందని చెప్పారు.

చిత్రం..మియాక గ్రామాన్ని మహేశ్‌నగర్‌గా మారుస్తూ వెలిసిన బోర్డు