జాతీయ వార్తలు

ఇథనాల్ వాడకంతో చమురు దిగుమతులు తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఇథనాల్ వాడకాన్ని పెంచడం ద్వారా ముడి చమురు దిగుమతులను భారీగా తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ జీవ ఇంథన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ, పెట్రోల్‌లో చెరకు ద్వారా తీసిన సారాన్ని కలపడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో సుమారు 12,000 కోట్ల రూపాయల విలువైన ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇందుకుగాను సుమారు రూ.10,000 కోట్ల వ్యయంతో 12 బయో రిఫైనరీలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంటకు సంబంధించిన చెత్తాచెదారం, జీవావశేషాలు, పట్టన వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఇంథనాన్ని ఉత్పత్తి చేసే ఈ బయో రిఫైనరీల వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడమేగాక, ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. రైతులు అదనపు ఆదాయాన్ని పొందడానికి ఇదొక మార్గమని వ్యాఖ్యానించారు. చెరకు పిప్పి, ఇతర వ్యర్థాలతో ఇంథనాన్ని తయారు చేస్తే, పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచంలోనే ఇంథనాన్ని ఎక్కువగా వాడే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని, అయితే, ఇందులో 81 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. బయో ఇంథనం ద్వారా కొంతవరకు దిగుమతులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. జీవ వ్యర్థాలను ఇంథనంగా మార్చడం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయన్నారు. చక్కెర ఉత్పత్తి కోసం చెరకును క్రషింగ్ చేసిన తర్వాత మిగిలే పిప్పితో నా ణ్యమైన ఇథనాల్ తయారీ సాధ్యమవుతుందని మోదీ అన్నా రు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి బయో ఇథనాల్ ఉత్పత్తి ఏటా 38 కోట్ల లీడర్లుకాగా, కేంద్రం తీసుకున్న పలు చర్యలతో ఇది 141 కోట్ల లీటర్లకు పెరిగిందని తెలిపా రు. ఈ పెరుగుదల కారణంగా సుమారు రూ.4,000 కోట్ల విలువైన దిగుమతులను తగ్గించగలిగామని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని 12,000 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. ప్రత్యామ్నాయ ఇంథన ఉత్పత్తి, వాడకం దేశానికి సర్కారు అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.