జాతీయ వార్తలు

విమర్శలపై గట్టి సమాధానం చెబుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఆగస్టు 20: తనపై వస్తున్న విమర్శలకు అవసరమైనప్పుడు గట్టి సమాధానం చెబుతానని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకార వేడుకల్లో పాల్గొనేందుకు పాక్ వెళ్లిన సందర్భంగా సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమ్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిన్న తీవ్రంగా దుమ్మెత్తిపోసిన విషయం విదితమే. ‘పాక్‌లో ఆయన (సిద్దూ) చేసిన చర్య నిజంగా తప్పే. ఈ విషయంలో నేను ఆయనను సమర్థించలేను. నిత్యం మనదేశంలోని సరిహద్దులో భారత్ జవాన్లు కన్నుమూస్తున్నార్న వాస్తవాన్ని సిద్దూ మరువరాదు. అంతెందుకు నా సొంత ప్రాంతానికి చెందిన ఒక మేజర్, ఇద్దరు జవాన్లు కొద్ది నెలల క్రితం పాక్ గుళ్లకు బలయ్యారు. ఇవన్నీ సిద్ధు విస్మరించారా?’ అని సీఎం అమరీందర్ సింగ్ సిద్దూపై విమర్శలు గుప్పించారు. పాక్ నుంచి నిన్ననే తిరిగివచ్చిన సిద్దూ తన చర్యలను సమర్థించుకున్నారు. తనపై వస్తున్న విమర్శలపై అందరికీ గట్టి సమాధానం అవసరమైన సమయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ‘మనమందరం ఒకే సంస్కృతికి చెందినవారం, చారిత్రాత్మకమైన గురుద్వార కర్తాపూర్ సాహిబ్‌కు మార్గం తెరుస్తామని వారు అన్నారు, అందుకే నేను ఆలింగనం చేసుకున్నా’ అని ఆయన వివరించారు. కాగా సిద్దూ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ సమర్థించారు. ఇందులో సిద్ధు చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తాను కూడా గురుద్వారా కర్తాపూర్ సాహిబ్‌కు మార్గాన్ని తెరవాలని కోరుతున్నానన్నారు. ఇండియా-పాక్ సరిహద్దును కనుక తెరిస్తే పంజాబ్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కాగా, ఇమ్రాన్ ప్రధానిగా చేసే ప్రమాణస్వీకార ఉత్సవానికి భారత్ తరఫున నవజోత్ సింగ్ సిద్ధు మాత్రమే హాజరయ్యారు. కాగా, పాక్‌లో ఆయన ఆర్మీచీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంపై సొంత కాంగ్రెస్ పార్టీలో సైతం విమర్శలు వెల్లువెత్తాయి.