జాతీయ వార్తలు

నదుల అనుసంధానం ఘనత బాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశంలో నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనతంరం ఉమ విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినందునే నదుల అనుసంధానంపై కేంద్రం సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలోని నదుల మధ్య 16 అనుసంధానాలు చేయాలని సంకల్పించినప్పటికీ కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణ నదుల మధ్యే అనుసంధానం జరిగిందని గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మూడేళ్ల కాలంలో 160 టీఎంసీల నీరును కృష్ణానదీ పరీవాహక ప్రాంతానికి తీసుకొచ్చి పంటలను కాపాడినట్టు చెప్పారు. గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి నదుల మధ్య అనుసంధానం చేసేముందు గోదావరి నీటి లభ్యతపై శాస్ర్తియ అధ్యయనం చేయాలని సూచించినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలిపారు. పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన అన్ని వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు అందిస్తున్నట్టు తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.2700 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. నీటి నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నామని ఉమ గుర్తుచేశారు. కృష్ణానదికి 27 కి.మీ. ఎగువన ఒక బ్యారేజీని నిర్మించనున్నట్టు తెలిపారు.