జాతీయ వార్తలు

కష్టాల్లో కృంగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దివంగత మాజీ ప్రధాని వాజపేయి వత్తిడిలో కృంగిపోవడం, కష్టాల్లో నిరాశపడటం ఎన్నడూ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాజపేయికి సంతాపంగా జరిపిన ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై కొన్నిదేశాల వైఖరిని మార్చడంలో వాజపేయి కృతకృత్యులయ్యారని అన్నారు. వాజపేయి కారణంగానే ఉగ్రవాదం అంశం ప్రపంచం దృష్టికి వచ్చిందని అన్నారు. 13రోజుల పాటు వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఏ పార్టీ సుముఖత చూపలేదని, అందుకే అప్పుడు తమ ప్రభుత్వం పడిపోయిందని ఆయన చెప్పారు. అలా అని వాజపేయి తన ఆశ, ఆశయాలను ఎన్నడూ వదులుకోలేదని, మరింత అంకితభావంతో ప్రజలకు సేవ చేసి మార్గదర్శకులుగా నిలిచి తిరిగి పూర్తికాలం ప్రధానిగా చేశారని అన్నారు. వాజపేయి హయాంలోనే కొత్తగా ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఎలాంటి నిరసనలు, ఆందోళనలు లేకుండా రాష్ట్రాలుగా ఏర్పడ్డాయని మోదీ చెప్పారు. వాజపేయి ధైర్యసాహసాల వల్లే భారత్ అణుశక్తి గల దేశంగా ప్రపంచం సరసన నిలిచిందని అన్నారు. అణుపరీక్షలు నిర్వహిస్తున్న విషయం మూడో కంటికి సైతం తెలియకుండా విజయవంతంగా నిర్వహించి ఒక గొప్ప నాయకత్వం ఉంటే ఏమైనా చేయవచ్చునని నిరూపించారని మోదీ ప్రశంసించారు. తన భావాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. పార్లమెంట్‌లో కొత్త సంప్రదాయాలకు ఆయన ఆద్యుడిగా నిలిచారని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ భారతరత్న వాజపేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజపేయి నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఇటీవలే కన్నుమూసిన వాజపేయిని స్మృతిస్తూ మాట్లాడడమన్నది తనకెంతో బాధాకరంగా ఉందని తెలిపారు. వాజపేయి సంస్మరణ సభకు తాను కూడా హాజరయ్యే రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు. ఈ సంస్మరణ సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోంమంత్రి రాజ్‌నాథ్, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని దేశానికి వాజపేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

చిత్రం..వాజపేయ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ