జాతీయ వార్తలు

తుంగభద్రకు తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, ఆగస్టు 20: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద తగ్గిపోయింది. శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు. దీంతో జలాశయానికి ఇన్‌ఫ్లో కూడా తగ్గింది. నాలుగు రోజులుగా 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో 33 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని నదిలోకి విడుదల చేశారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో 13 గేట్లు మూసివేశారు. 20 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 43,240 క్యూసెక్‌ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1631.01 అడుగులుగా నమోదైంది. ఇన్‌ఫ్లో 92,673 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో 93.353 టీఎంసీల నీరు నిల్వ ఉంది.