జాతీయ వార్తలు

యూఏఈ దాతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారీ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. 700 కోట్ల రూపాయల మేరకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఒక వార్తా సంస్థకు వెల్లడించారు. కేరళను ఆదుకునేందుకు యుఏఈ నేషనల్ ఎమర్జెన్సీ కమిటీ సమావేశం నిర్వహించినట్లు యూఏఈ మీడియాలో వార్తలు వెలువడిన రెండు రోజులకు రూ.700 కోట్ల సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ అధ్యక్షతన జరిగే ఈ కమిటీ సమావేశంలో యూఏఈలోని సాంఘిక సేవా సంస్థలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. కేరళను అన్ని విధాలా ఆదుకుంటామని యుఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ అంతకుముందే ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘మన దేశాభివృద్ధిలో భాగం పంచుకుంటున్న కేరళీయులను ఆదుకోవడం మన కర్తవ్యం. కేరళను వరదలు ముంచెత్తాయి. వందలాది మంది చనిపోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భారతీయ సోదరులకు చేయూతను అందిద్దాం’ అని ట్విట్టర్‌లో ఆ దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. ఇలావుండగా యుఏఈలో దాదాపు 2 మిలియన్ల మంది భారతీయులు తమ విధులను నిర్వహిస్తున్నారు. అంటే ఆ దేశ జనాభాలో దాదాపు 27 శాతం భారతీయులే.
కాగా, కేరళ వరద సాయం కోసం యుఏఈ ఇవ్వడానికి ముందుకొచ్చిన రూ.700 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ఇతర దేశాలనుంచి వరద సహాయాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని ఈ నియమమే యుఏఈకి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించినట్లుగా కథనాలు వెలువడ్డాయ. అయతే ఈ సహాయాన్ని స్వీకరించాలా వద్దా అన్నదానిపై విదేశాంగ మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయం అవుతుందని ఆ అధికారి వెల్లడించారు. కాగా యుఏఈ సహాయానికి సంబంధించి ఇంతవరకు తమకెలాంటి ప్రతిపాదన అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.