జాతీయ వార్తలు

అన్నీ పోయాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 21: కేరళలోని తన ఇంట్లో దశాబ్దాల కాలం నుంచి భద్రపరుచుకుంటూ వస్తున్న పురాతన రికార్డులు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌లు భారీ వర్షాలు, వరదల తాకిడికి ఏమయ్యాయోనని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత పీటీ నాయర్ వాపోయారు. ఎర్నాకుళం జిల్లా చందమంగళమ్ గ్రామంలోని తన స్వగృహంలో ఎంతోకాలం నుంచి సేకరించి, భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న విలువైన పురాతన పేపర్ క్లిప్పింగ్‌లు, ఇతర రికార్డుల పరిస్థితి ఎలా ఉందోనని ఆయన ఆందోళన చెందుతున్నారు. వీటిని కాపాడుకునేందుకు ప్రస్తుతం అక్కడికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని, రహదారులన్నీ వరదనీటిలో మునిగి ఉన్నాయని ఆయన అన్నారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రం స్వగ్రామంలోని తన ఇంటికి ఒకసారి వెళ్లొస్తానని ఆయన స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉంటున్న తమ కుటుంబ సభ్యులు మాత్రం ఆఖరి నిమిషంలో వరదల్లో చిక్కుకుపోకుండా సురక్షితంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. నాయర్ తన భార్య సీతతో కలసి కోల్‌కతాలో నివసిస్తున్నా, కేరళలో ఉంటున్న తమ కుటుంబ సభ్యులతో మాత్రం తరచూ ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. తన జీవితంలో ఇలాంటి ఉపద్రవం ఎన్నడూ చూడలేదని 84 ఏళ్ల నాయర్ అన్నారు. కోల్‌కతా చరిత్రపై ఆయన 50కి పైగా పుస్తకాలు రాశారు.