జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 11: అమర్‌నాథ్ యాత్రికులకు కష్టాలు తప్పటం లేదు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో బల్తాల్ మార్గంలో అమర్‌నాథ్ యాత్ర చేసి తిరుగుపయనమైన భక్తులు సోనామార్గ్ ప్రాంతంలో చిక్కుకుపోయారు. మధ్యకాశ్మీర్‌లోని గందేర్బల్ జిల్లాలోని ఓ పర్యాటక కేంద్రం వద్ద యాత్రికులు నిలిచిపోయారు. జూలై 8న అమర్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజామున శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడి నుంచి జమ్మూకు వెళ్లటానికి బస్సులు ఉంటాయని ట్రావెల్ మేనేజర్లు చెప్పారని.. అయితే ఒక్క బస్సు కూడా లేదని పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనగర్‌కు చేరుకున్నప్పటి నుంచి తమకు ఎలాంటి సమాచారం లేకుండా పోయిందని, జమ్ముకు ఎలా చేరుకోవాలో తెలియటం లేదని వారన్నారు. కాగా గందేర్బల్ డిప్యూటీ కమిషనర్ తారిఖ్ హుస్సేన్ స్పందిస్తూ 24,500మంది యాత్రికుల సౌకర్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.