జాతీయ వార్తలు

జంతు హక్కులను పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: జంతువుల వధ తగ్గించి, మాంసం వినియోగం కోసం వృక్షజాతుల నుండి, కృత్రిమంగా మాంసం తయారుచేయడం ద్వారా దేశంలో సరికొత్త ఆహార విప్లవానికి బీజం వేసినట్టవుతుందని కేంద్ర శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రోటీన్లను విభిన్నంగా వినియోగించుకోవడంపై శుక్రవారం నాడు ఐఐసీటీ ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ మానవత్వపు అంతర్జాతీయ సంఘం (హెచ్‌ఎస్‌ఐఐ), సీఎస్‌ఐఆర్, సీసీఎంబీ , భారత స్వచ్ఛ ఆహార సంస్థ, అటల్ అంకుర కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో మేనకా గాంధీ మాట్లాడుతూ జంతువుల హక్కులను సైతం పరిరక్షించాలని, మానవ అవసరాలకు కోసం విచ్ఛలవిడిగా జంతువుల వధ సరికాదని అన్నారు. ఒక కిలో మాంసం కోసం ఒక జంతువుకు 11 కిలోల ఆహారం ఇవ్వాల్సి ఉంటుందని, బతికి ఉన్న కాలంలో అవి దాదాపు 60 వేల లీటర్ల నీళ్లు అవి తాగుతాయని అన్నారు. ఇదంతా పర్యావరణంపై చెప్పలేనంత భారం అవుతుందని చెప్పారు. కణసంబంధమైన మాంసం ల్యాబ్‌లలో తయారవుతుందని, వీటికి జంతువులతో పనే్లదని వివరించారు. ఇది కొంతవరకూ యువతకు భృతి కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో ఆహారావసరాల వల్ల జంతు మాంసం వినియోగం, దానివల్ల పరిసరాలపై వస్తున్న మార్పుల వల్ల ఇటువంటి గోష్టి అవసరమైందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. కాగా, సదస్సులో ప్రసంగించిన అనంతరం మేనకా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ మాంసాహారులు వారి వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం మాంసాహార విధానాల్లో ప్రతిబంధకాలను తొలగించి స్వచ్ఛమైన శుభ్రమైన మాంసాహారాన్ని భుజించవచ్చని అన్నారు. కృత్రిమ మాంసాహార స్వీకరణ వల్ల పర్యావరణానుకూలత కలుగుతుందని అన్నారు. మాంసం తయారీ విధానాల వల్ల జంతువుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. దీనిద్వారా పర్యావరణంపై పడే తీవ్రమైన ప్రభావాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
ప్రస్తుత విధానాల్లో తయారుచేస్తున్న ఫ్యాక్టరీ గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తుల వల్ల పర్యావరణంలో తీవ్రమైన మార్పులు ఏర్పడటమే గాక, ఆహారపు అభద్రత, సూక్ష్మజీవులు మందులు ప్రతిఘటించే శక్తి పొందడం, జంతు సంక్షేమ ప్రశ్నార్ధకంగా మారడం వంటి అనేక దుష్పరిమాణాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ఈ కారణంగా ఇటువంటి చర్చా కార్యక్రమాల ద్వారా పరిశుభ్రమైన కృత్రిమ మాంసాన్ని తయారుచేయడం, మొక్కల ద్వారా జంతు మాంసాన్ని తయారుచేసి వ్యాపార కూడళ్లలో ప్రవేశపెట్టడం, వీటి తయారీకి కొత్త మార్గానే్వషణకు అంకుర పరిశ్రమల స్థాపన, వంటి అనేక విషయాలపై కూలంకుషంగా చర్చించడానికి ఇటువంటి సదస్సులు గొప్ప వేదికలు అవుతాయని మేనకా గాంధీ చెప్పారు.హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఎండీ ఎన్‌జీ జయసింహ, గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ ఎండీ వరుణ్ దేశ్‌పాండే, గుడ్ మిల్క్ ఫౌండర్ అభయ్, జెనిటిక్ గెయిన్స్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ కే వర్షనే, గుడ్ డాట్ ఫౌండర్ స్టీఫెన్ డాన్, డాక్టర్ సంధ్య శ్రీరాం, డాక్టర్ పవన్ ధార్, బ్రియాన్ స్పియర్స్, నికోల్ రౌలింగ్, డాక్టర్ ఎన్ మధుసూధనరావు, సౌమ్యారెడ్డి తదితరులు ఈ సదస్సులో వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న అవకాశాల్లో పరిశుభ్రమైన కృత్రిమ మాంసం తయారీ ఒక ఉత్తజకరమైన అవకాశమని, అయితే అధిక స్థాయిలో ఉత్పత్తి చేయడానికి, తయారీ ఖర్చులు తగ్గించడానికి వినూత్నమైన ఆవిష్కరణలు చేయాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. కృత్రిమంగా పరిశుద్ధమైన మాంసం తయారీకి అవసరమైన అంకుర పరిశ్రమలను స్థాపించడం, వాటికి మార్గదర్శక నియంత్రణ విధానాలను రూపొందించడం ఒకే ప్రదేశంలో జరుగుతుందని ఆయన చెప్పారు.

చిత్రం..తార్నాకలోని సీసీఎంబీ సదస్సులో పాల్గొన్న మేనకా గాంధీ