జాతీయ వార్తలు

లైంగిక వేధింపులపై విచారణ జరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఎయిర్ ఇండియాలో ఇప్పటి వరకు పనె్నండు లైంగిక వేధింపుల కేసులు ఆ సంస్థ అంతర్గత ఫిర్యాదుల విభాగానికి వచ్చాయి. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారులు వివరాలు అందజేశారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లలో జరిగిన లైంగిక వేధింపుల కేసులపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గురువారం న్యూఢిల్లీలో సమీక్షించారు. ఎయిర్ సీఎండీ ప్రదీప్ సింగ్ కరోలాను, సీనియర్ అధికారులతోనూ మంత్రి మేనకా గాంధీ ఈ సందర్భంగా భేటీ అయ్యారు. మొత్తం 12 లైంగిక వేధింపులపై కేసులపై ప్రస్తుతం విచారణ సాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రైవేటు విమానాల సంస్థలకు సంబంధించి పలు లైంగిక వేధింపుల కేసులు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌర విమానయాన సంస్థకు అందుతున్నట్లు కూడా ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలిపారు. ఓ ఎయిర్ హోస్టెస్ తన సీనియర్ అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఇచ్చిన ఫిర్యాదును మంత్రి ఈ సందర్భంగా ఎయిర్ సీఎండీ కరోలా వద్ద ప్రస్తావించారు. ఈ కేసులో ఇంతవరకు నిజనిర్ధారణ చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని కరోలాకు మంత్రి మేనకాగాంధీ గత వారం సమన్లు జారీ చేయడం జరిగింది. అంతకు ముందు బాధితురాలు స్వయంగా మంత్రి మేనకా గాంధీని కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో ఈ వ్యవహారంపై జూన్ నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి పౌర విమానయాన శాఖను కోరడం జరిగింది. కాగా ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి నివేదికను త్వరలో రూపొందించడం జరుగుతుందని, అయితే ఎయిర్ ఇండియా అంతర్గత ఫిర్యాదుల విభాగం (ఐసీసీ) ఆధ్వర్యంలో ఈ విచారణ రహస్యంగా సాగుతున్నందున విచారణ వివరాలు అందజేయలేమని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. విచారణను వేగవంతం చేసి ప్రయాణికుల విశ్వసనీయతను చూరగొనాలని, 70, 80 దశకాల్లోలాగా ఇప్పుడు విమాన రంగం కేవలం ఐశ్వర్యవంతులకు సంబంధించిం ది మాత్రమే కాదని, ఆ రంగం విస్తరించి మధ్య తరగతి వారికీ చేరువైందని మంత్రి మేనకాగాంధీ ఈ సందర్భంగా అన్నారు. విమాన ప్రయాణికుల పట్ల, తమ సహచర మహిళా ఉద్యోగుల పట్ల పైలెట్ల వంటి బాధ్యతల్లో ఉండే పురుష ఉద్యోగులు సభ్యతగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించా రు. మహిళా ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పారదోలేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆదేశాలను ప్రైవేటు విమాన సంస్ధల ఉద్యోగులకూ వివరించి పరిస్థితులు చక్కదిద్దాలన్నారు.