క్రైమ్/లీగల్

చిదంబరంపై ప్రశ్నల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఎయిర్ సెల్- మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు విచారించింది. సుమారు ఆరు గంటలపాటు ఆయనపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విశ్వసనీయవర్గాల కథనం మేరకు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోని విచారణాధికారి ఎదుట శుక్రవారం హాజరైన చిదంబరం నుంచి ఈడీ వాగ్మూలాన్ని రికార్డు చేసింది. గత జూలైలో ఆయనను ఈకేసులో నిందితునిగా చేరుస్తూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వచ్చే పక్షం రోజుల్లో ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఈడీ స్వయంగా నమోదు చేసే అవకాశాలున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను చిదంబరం ఖండిస్తున్న క్రమంలో ఆయనను ప్రశ్నించేందుకు ఈడీ సొంత ప్రశ్నావళిని సైతం రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆర్థిక వ్యవహారాలు సాగిన సమయంలో విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు (ఎఫ్‌ఐపిబీ)లో విధులు నిర్వహించిన అధికారులను ఈడి ప్రశ్నించి వారి వాగ్మూలాలను నమోదు చేయడం జరిగింది. ఆ బోర్డు ప్రస్తుతం పనిచేయడం లేదు.
ఈ బోర్డు ద్వారా ఎయిర్‌సెల్ మాక్సిస్ సంస్థ ఒప్పందానికి అంగీరించారని అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న చిదంబరం అభియోగాలు నమోదయ్యాయి. కాగా ఇదే కేసులో చిదంబరం కుమారుడు కార్తిని సైతం సీబీఐ రెండు సార్లు ప్రశ్నించడం జరిగింది.