జాతీయ వార్తలు

మా వ్యవహారాల్లో జోక్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: కాశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని పాకిస్తాన్‌కు భారత్ హితవు పలికింది. ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై పాకిస్తాన్ దృష్టిపెట్టడం మంచిదని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. కాశ్మీర్‌లో భద్రతా దళాల చర్యల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘనలకు భారత్ పాల్పడుతోందన్న పాక్ ఆరోపణలను ఆయన ఖండించారు. కాశ్మీర్ లోయలో కంటే కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఈ రకమైన ఉల్లంఘనలు తీవ్రస్థాయిలోనే జరుగుతున్నాయని, పాక్ పాలకులు వాటిపై ఆందోళన చెందడం మంచిదని తెలిపారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇందుకు సంబంధించి పాకిస్తాన్ ఏ రకంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.