జాతీయ వార్తలు

రెండోరోజూ రాజ్‌నాథ్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: కాశ్మీర్ పరిస్థితి రోజురోజుకూ తీవ్రం కావడంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిపక్ష పార్టీలతో కూడా సంప్రతింపులు జరిపి రాష్ట్రంలో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పటివరకూ 23 మందిని బలిగొన్న అల్లర్ల నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేయడానికి అన్ని విధాలా సహకరిస్తామని మెహబూబా ముఫ్తీకి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. మరోపక్క వరుసగా రెండోసారి కూడా రాష్ట్ర పరిస్థితిని సమీక్షించారు. ప్రతిపక్ష పార్టీలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని శాంతియుత పథంలోకి తీసుకురావచ్చునని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.