జాతీయ వార్తలు

సమాచార మంత్రి ఆకస్మిక తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: కేంద్ర సమాచారం, ప్రసారశాఖల మంత్రి ఎం వెంకయ్యనాయుడు తన మంత్రిత్వశాఖ అధికారులకు సోమవారం షాక్ ఇచ్చారు. గత వారమే బాధ్యతలు చేపట్టిన ఆయన అధికారులకు ముందుస్తు సమాచారం ఇవ్వకుండా ఉదయమే కార్యాలయానికి వచ్చారు. ఎవరెవరు ఎన్నింటికి ఆఫీసుకు వస్తున్నారు? కార్యాలయంలో పరిశుభ్రతపై ఆరా తీశారు. సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ కూడా వెంకయ్య వెంట ఉన్నారు. కార్యాలయానికి ఆలస్యంగా రావడంపై అధికారులనుంచి వివరణ కోరారు. తొమ్మిదిన్నర గంటల సమయంలో మంత్రులిద్దరూ ఆకస్మికంగా కార్యాలయానికి రావడం ఉద్యోగులను కంగారుపెట్టింది. ‘మంత్రి కార్యాలయాల్లోని అన్ని గదులు కలియతిరిగారు. వాష్‌రూమ్‌లో ఏమేరకు శుభ్రత పాటిస్తున్నదీ వాకబుచేశారు. అన్ని రూముల్లోని విద్యుత్ సరఫరా, ఫిట్టింగ్‌ల పనితీరును నిశితంగా గమనించారు’ అని సమాచార, ప్రసార సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వెంకయ్యనాయుడు గత వారమే సమాచార, ప్రసార మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ఉదయం 9.30 గంటలకే మంత్రి శాస్ర్తీ భవన్‌కు చేరుకున్నారు. రోజువారీ కార్యకలాపాలు, స్వచ్ఛతపై నిత్యం సమీక్షించాల్సిందిగా సంయుక్త కార్యదర్శులను ఆదేశించారు’ అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు టైమ్‌కు ఆఫీసుకు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధిపతులకు సూచించారు.