జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఆగని అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: కాశ్మీర్‌లో మూడో రోజైన సోమవారం కూడా హింసాత్మక పరిస్థితులు కొనసాగాయి. కాశ్మీర్‌లోయలో హింస, దహనకాండలు పెట్రేగిపోయాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కెన్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హుటాహుటిన స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పటివరకు ఈ హింసాకాండలో మరణించినవారి సంఖ్య 23కు పెరిగింది. రాష్ట్రం అంతటా జనజీవనం స్తంభించిపోయింది. అన్నిచోట్లా నిషేధాజ్ఞలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. శుక్రవారం హిజ్బుల్ కమాండ్ బుర్హన్ వని భద్రతా దళాల కాల్పుల్లో మరణించినప్పటి నుంచీ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సోపోర్‌లో ఒక పోలీసు స్టేషన్‌ను, పుల్వామాలోని ఒక వైమానిక విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని తాజాగా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. అలాగే దాదాపు రాష్టవ్య్రాప్తంగా భద్రతా దళాలపై అల్లరి మూకలు రాళ్లు రువ్వుతూ అన్నిచోట్లా అలజడులు రేకెత్తించారు. వైమానికదళ విమానాశ్రయంలోని గడ్డిని ఆందోళనకారులు తగులబెట్టారని, పోలీసులపై రాళ్లు రువ్వుతూ ముందుకు దూసుకొచ్చారని స్పష్టమవుతోంది. భద్రతా దళాలు ఎంతగా తరిమికొట్టిగా మళ్లీ సంఘటితం అవుతూ ఆందోళనకారులు విధ్వంసకాండకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. సోపోర్, హంద్వారా, బందిపొరా, సరాముల్లా వంటి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాశ్మీర్‌లో పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 24 గంటల ముందుగానే అజిత్ దోవల్ స్వదేశానికి తిరిగివచ్చి పరిస్థితిని సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో పాల్గొన్న దోవల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. సమస్యలున్నచోట పరిష్కారాలు ఉంటాయని, కాశ్మీర్ ప్రస్తుత పరిస్థితులను అదుపు చేయగలమన్న ధీమా తమకు ఉందని విలేఖరుల సమావేశంలో దోవర్ వ్యాఖ్యానించారు. రానున్న 72 గంటల్లోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించగలుగుతామని దోవల్ చెప్పినట్లు తెలుస్తోంది. అల్లర్లతో అట్టుడుకుతున్న కాశ్మీర్‌కు కేంద్ర ప్రభుత్వం సోమవారం అదనపు బలగాలను తరలించింది. ఇప్పటికే 1200 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు రాష్ట్రంలో భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఈ అదనపు బలగాలు చేరడం వల్ల పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తేవడానికి ఆస్కారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా వెయ్యి మంది చొప్పున సిబ్బంది కలిగిన 60 బెటాలియన్లను ఇప్పటికే రాష్ట్రంలో మోహరించారు.

చిత్రం.. శ్రీనగర్‌లో సోమవారం పోలీసులపై రాళ్లు రువ్వుతున్న అల్లరి మూక