జాతీయ వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఒకే వేదికపై నుండి ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉభయులతో ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించటం ద్వారా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గౌరవాన్ని కాపాడటంతో పాటు ప్రియాంకగాంధీతో రాజకీయ అరంగేట్రం చేయించవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాహుల్ ఎన్నికల ప్రచారం చేయటం వల్ల యూపీలో ఆశించిన ఫలితాలను సాధించలేమనే అనుమానాల నేపథ్యంలో ప్రియాంక సేవలను ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే ప్రియాంకను రాజకీయాలలోకి తీసుకురావటం వల్ల రాహుల్ రాజకీయ భవితవ్యం దెబ్బ తింటుందనే భయాన్ని కాంగ్రెస్‌లోని ఒక వర్గం వ్యక్తం చేసింది. ప్రియాంక స్వతంత్రంగా ఎన్నికల ప్రచారం చేస్తే రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం కావటంతో ఖాయం.
అంతే కాదు, రాహుల్ పార్టీ గెలుపుగుర్రం కాదు కాబట్టే ప్రియాంకను రంగంలోకి తీసుకువస్తున్నారని బిజెపి ప్రచారం చేస్తుందని, ఆ ప్రచారం యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయని కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మధ్యేమార్గంగా రాహుల్, ప్రియాంకలతో ఒకేసారి ఎన్నికల ప్రచారం ప్రారంభించటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని సోనియా భావిస్తున్నారు. యూపీలో కాంగ్రెస్ బలంగా ఉండే ప్రాంతాల్లో రాహుల్, ప్రియాంకల సంయుక్త ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రాహుల్, ప్రియాంకలు ఒకే వేదిక పైనుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లోని దాదాపు సగం అంటే రెండు వందల అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి వచ్చేలా ప్రియాంక ఎన్నికల సభలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. మధ్యమధ్యలో రాహుల్ గాంధీ అక్కతో పాటు ఎన్నికలప్రచారంలో పాల్గొనటం ద్వారా అంతా గాంధీ కుటుంబం ద్వారానే జరుగుతోందనే భావన కల్పించాలనుకుంటున్నారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో రాహుల్ ప్రచారం చేస్తే ప్రియాంక మాత్రం ప్రధానంగా యుపికే పరిమితం అవుతారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేయించే విషయం పరిశీలనలో ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు.
ఇదిలా ఉంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రియాంకను యుపిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయకూడదని కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలు కాంగ్రెస్ ముఖ్య ప్రచారకులు అనే సందేశం పంపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. మొదట్లో కేవలం సోనియా మాత్రమే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తగా ఉండేవారు. ఆ తరువాత రాహుల్ జత కలిసారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ పేరు కూడా కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తల జాబితాలో చేరుతోంది.