క్రైమ్/లీగల్

మాగాణి భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మాగాణి భూములను (వెట్ ల్యాండ్స్) పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ భూములు ఆక్రమణకు గురికాకుండా, వ్యర్థ పదార్థాలకు డంపింగ్ యార్డుగా తయారుకాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వివరాలను పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు తెలియచేసింది. ఈ మాగాణి భూములను గుర్తించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని కూడా తెలిపింది. జస్టిస్ ఆర్‌ఎస్ రాథోర్, ఎస్‌ఎస్ గార్బియేల్‌తో కూడిన బెంచి ఈ కేసును విచారించింది. మాగాణి భూముల పరిరక్షణ నిర్వహణ రూల్స్ 2017 కింద గత ఏడాది సెప్టెంబర్ 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కేసులో పిటిషనర్లు ఒక పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేశారని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జాబితా తయారుచేశామని, ఈ జాబితాలో లేని అంశాలు ఏవైనా ఉంటే కలపాలని కోరవచ్చని కేంద్రం పేర్కొంది. 2017 వెట్‌ల్యాండ్స్ రూల్స్ అంశాన్ని సవాలు చేశారని, కోర్టు పరిధిలో విచారణలో ఉందని పేర్కొన్నారు. పర్యావరణ వేత్తలు ఆనంద ఆర్య, పుష్ప జైన్‌లు దాఖలు చేసిన పిటిషన్లను బెంచి విచారించిన తర్వాత మాగాణి భూముల వివరాలు సమర్పించాలని పర్యావరణ శాఖను ఆదేశించింది. కేంద్రం 1986 పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి రూల్స్‌ను రూపొందించిందని పర్యావరణ వేత్తలు పిటిషన్‌లో పేర్కొన్నారు.