జాతీయ వార్తలు

మూడోరోజూ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ మూడో రోజూ అట్టుడికింది. అనేక ప్రాంతాల్లో హింస, విధ్వంసకాండలతో తల్లడిల్లాయి. ఒక పోలీసు స్టేషన్‌ను దగ్ధం చేసిన అల్లరిమూకలు వైమానికదళ విమానాశ్రయంపై దాడికి ఒడిగట్టారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హుటాహుటిని స్వదేశానికి తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేసిన కేంద్రం అదనపు బలగాలను తరలించింది. ప్రతిపక్ష నేతలైన సోనియా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాలతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంతనాలు జరిపారు. నిరంతరంగా పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరోపక్క కాశ్మీర్‌లో మానవ హక్కుల అణచివేత జరుగుతోందంటూ పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది.

చిత్రం.. పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు