జాతీయ వార్తలు

బెంగాల్‌లో జెఎంబి పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 11: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్), జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబి) పశ్చిమబెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గల జిల్లాలకు చెందిన నిరుద్యోగులపై ప్రత్యేకించి ముస్లిం నిరుద్యోగులపై కేంద్రీకరించాయి. తన నెట్‌వర్క్ విస్తరణ కోసం జెఎంబి తొలుత ఈ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించగా, తరువాత ఐఎస్‌ఐఎస్ కూడా దాన్ని అనుసరిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థల సూత్రధారులు నిరుద్యోగ యువతను తమ నెట్‌వర్క్‌లలోకి లాగుతున్నారు. ఇటీవల మొహమ్మద్ ముసీరుద్దీన్ (25) అరెస్టుతో పశ్చిమబెంగాల్‌లో జెఎంబి సంస్థ ఉనికి వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి బర్ద్వాన్, ముషీరాబాద్, బీర్‌భమ్ సహా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని జిల్లాల్లో ఈ ఉగ్రవాద సంస్థ విస్తరిస్తోందని రాష్ట్ర ఉన్నత స్థాయి సిఐడి అధికారి ఒకరు తెలిపారు. జెఎంబి తన రహస్య కార్యకలాపాలను కోల్‌కతా నగరంలోని వివిధ ప్రాంతాలకూ విస్తరించిందని ఆయన వివరించారు. రాష్ట్రంలో దాని స్థావరాలు ఉన్నాయనే విషయాన్ని 2014లో జరిగిన ఖాగ్రాగఢ్ పేలుళ్లు నిరూపించాయని ఆయన తెలిపారు. బర్ద్వాన్ జిల్లా ఉగ్రవాదుల మ్యాప్‌లో చేరిపోయిన విషయం 2014 అక్టోబర్‌లో వెలుగుచూసింది. ఖాగ్రాగఢ్‌లోని ఒక అద్దె ఇంటిలో శక్తివంతమైన పేలుడు పదార్థాలు తయారు చేస్తుండగా పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత జెఎంబి ఉగ్రవాదులు మృతి చెందారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గల పశ్చిమబెంగాల్ జిల్లాల నుంచి యువకులను జెఎంబి రిక్రూట్ చేసుకుంటూ వస్తోందని ఎన్‌ఐఎ తన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. ‘నిరుద్యోగ యువతే ఉగ్రవాదుల లక్ష్యం. జెఎంబి ఎప్పటి నుంచో ఈ పని చేస్తోంది. ఐఎస్‌ఐఎస్ ఇటీవలి కాలంలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది’ ఆ అధికారి తెలిపారు. జెఎంబి రిక్రూట్‌మెంట్‌లో పాత్రధారి అయిన ముసీరుద్దీన్ ఇంటరాగేషన్‌లో ఈ విషయం మరోసారి ధ్రువపడిందని పేర్కొన్నారు. ‘వీరు సూత్రధారులు. నియామకాలను నిర్వహిస్తుంటారు. ఒక్కొక్కరు ఒకటి లేదా రెండు జిల్లాలను పర్యవేక్షిస్తుంటారు. 16-30 ఏళ్ల మధ్య వయసు గల చదువుకున్న ముస్లిం యువతీ యువకులపై కేంద్రీకరిస్తుంటారు’ అని ఆ సిఐడి ఉన్నతాధికారి వివరించారు.